Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్రీడాస్ఫూర్తికి గొప్ప ఉదాహరణగా నిలిచిన లంక పేసర్ ఇసురు ఉడాన (వీడియో)

Isuru Udana Refuses To Run Out Injured Batsman || Oneindia Telugu
Watch: Sri Lanka bowler Isuru Udana’s show of sportsmanship wins internet

హైదరాబాద్: శ్రీలంక పేసర్‌ ఇసురు ఉడాన క్రీడాస్ఫూర్తికి గొప్ప ఉదాహరణగా నిలిచాడు. ఎందుకంటే, దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న మాంఝీ సూపర్ లీగ్‌లో గాయపడిన ప్రత్యర్థి జట్టు ఆటగాడిని రనౌట్‌ చేసేందుకు చాలా సమయం ఉన్నప్పటికీ అతడు అలా చేయలేదు. దీంతో ఇంటర్నెట్‌లో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

టోర్నీలో భాగంగా నెల్సన్‌ మండేలా బే గెయింట్స్‌, పార్ల్‌ రాక్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఇసురు ఉడాన పార్ల్‌ రాక్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. చివరి ఎనిమిది బంతుల్లో బే గెయింట్స్‌ విజయానికి 24 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో ఉడాన వేసిన బంతిని హీనో కున్‌ భారీ షాట్ ఆడాడు.

దీంతో నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న మార్కో మరాయిస్‌కు ఆ బంతి బలంగా తగిలింది. నొప్పితో అతడు విలవిల్లాడు. అదే సమయంలో తిరిగి క్రీజులోకి వెళ్లలేకపోయాడు. ఆ సమయంలో పక్కనే పడ్డ బంతిని అందుకున్న ఉడాన వికెట్ల వద్దకు వచ్చినా ప్రత్యర్థి జట్టు ఆటగాడి పరిస్థితి చూసి రనౌట్ చేయలేదు.

నిజానికి నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్‌ను రనౌట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ వికెట్లను గిరాటేయలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఉడాన చూపిన క్రీడాస్ఫూర్తిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "క్రీడా స్ఫూర్తి వర్ధిల్లింది" అని ఈ వీడియోని మాంఝీ సూపర్ లీగ్‌ అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

Story first published: Wednesday, December 11, 2019, 15:25 [IST]
Other articles published on Dec 11, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+