కండల శ్రీశాంత్ సోషల్ మీడియాలో హల్‌చల్..!(వీడియో)


హైదరాబాద్: ఒకప్పుడు భారత్ జట్టులో కీలక బౌలర్‌గా ఎదిగిన కేరళ స్పీడ్‌స్టర్ శ్రీశాంత్ ప్రస్తుతం క్రికెట్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ స్పాట్‌ఫిక్సింగ్ కుంభకోణంలో అతడు జైలుకు కూడా వెళ్లివచ్చాడు. అప్పటి నుంచి అతడు క్రికెట్ ఆడేందుకు బీసీసీఐ అనుమతించట్లేదు. ఈ నేపథ్యంలో అతడు సినీ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు.
శ్రీశాంత్ జిమ్‌లో సాధన చేస్తుండగా తీసిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ప్రతి వారం పోస్ట్ చేస్తూనే ఉన్నాడు. అతని కసరత్తులు, జిమ్ బాడీని చూసి నెటిజన్లు స్టన్ అవుతున్నారు. తాజాగా మరో వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న బాలీవుడ్ సినిమా కోసం శ్రీశాంత్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. పాత్రకు అనుగుణంగా ఫిట్‌గా తయారవుతున్నాడు.
ఫిట్‌నెస్ ట్రైనర్ దగ్గర ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిసింది. తన తదుపరి చిత్రం కెంపెగౌడ 2లో తన పాత్రకు అనుగుణంగా తన శరీరాన్ని మార్చుకుంటున్నాడు. అంతకుముందు బాలీవుడ్ చిత్రం అక్సార్ 2లో శ్రీశాంత్ నటించాడు. ఆ చిత్రానికి ఒకింత భాగస్వామిగా కూడా వ్యవహరించాడు. ఆ చిత్రం పెద్దగా ఆడకపోవడంతో.. మళ్లీ కాస్త గ్యాప్ తీసుకుని మళ్లీ అదే పనిలో పడ్డాడు.
శ్రీశాంత్ తన ఆఖరి అంతర్జాతీయ క్రికెట్‌ను ఆగష్టు 2011వ సంవత్సరంలో ఆడాడు. అతని కెరీర్ మొత్తంలో 27 టెస్ట్ మ్యాచ్‌ల్లో 87 వికెట్లు, 53 వన్డేల్లో 75 వికెట్లు పడగొట్టాడు. అతని కెరీర్‌లో 10 అంతర్జాతీయ టీ 20లు ఆడిన చరిత్ర కూడా ఉంది. 2013 ఐపీఎల్ సీజన్ స్పాట్ ఫిక్సింగ్‌లో నేరస్థుడిగా నిరూపణ అవడంతో జీవిత కాల నిషేదాన్ని అనుభవిస్తున్నాడు. అయినా ఇప్పటికీ అవకాశం ఇస్తే టీమిండియా తరపున ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని శ్రీశాంత్ అంటూ ఉండటం గమనార్హం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications