గిన్నిస్ రికార్డు: ఎత్తు నుంచి విసిరిన బంతిని ఒడిసి పట్టుకుంది (వీడియో)

హైదరాబాద్: ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు వికెట్ కీపర్ అలిస్ హీలే గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పింది. డ్రోన్ల సహాయంతో 80 మీటర్ల ఎత్తు నుంచి విసిరిన బంతిని ఒడిసి పట్టుకోవడంతో ఆమె ఈ ఘనత సాధించారు. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన ఈ అరుదైన ఘటనలో క్రికెట్ ఆస్ట్రేలియా సభ్యులు, ఐసీసీ, గిన్నీస్ అధికారులు పాల్గొన్నారు.
మూడో ప్రయత్నంలో విజయవంతమైన హీలే
అలిస్ హీలే తన రెండు ప్రయత్నాల్లో విఫలమవ్వగా మూడో ప్రయత్నంలో విజయవంతమయ్యారు. దీంతో అలిస్ హీలేకు గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించినట్టు అధికారులు ద్రవీకరించారు. ఇందుకు సంబంధించిన పత్రాన్ని ఆమెకు అందజేశారు. 2016లో ఈ రికార్డును ఇంగ్లాండ్ క్రికెటర్ క్రిస్టన్ నెలకొల్పగా, తాజాగా ఆ రికార్డును హీలే అధిగమించారు.
హేలీ మాట్లాడుతూ
గిన్నిస్ రికార్డు అందుకున్న తర్వాత అలిస్ హేలీ మాట్లాడుతూ "ఐసీసీ, క్రికెట్ ఆస్ట్రేలియా సంయుక్తంగా మహిళా క్రికెట్ అభివృద్దికి, పురుషులకు ఏ మాత్రం తీసిపోకుండా రికార్డులను నెలకోల్పేవిధంగా ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు. అంతర్జాతీయ మహిళల దినోత్సవానికి కొన్ని రోజుల ముందు ఈ రికార్డు సాధించడం ఆనందంగా ఉంది" అని అన్నారు.

హేలీ ఎవరో కాదు
"అయితే, ఈ గిన్నిస్ రికార్డు కోసం ముందుగా ఎలాంటి ప్రాక్టీస్ చేయలేదు. వచ్చే ఏడాది స్వదేశంలో జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌పైనే దృష్టి సారించాం" అని హీలే అన్నారు. అలిస్ హేలీ ఎవరో కాదు ఆస్ట్రేలియా టీమిండియా పేసర్ మిచెల్ స్టార్క్ సతీమణే. మిచెల్ స్టార్క్ పురుషుల జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తుండగా, హేలీ మహిళల జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications