Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR: ఇదేందయ్యా శ్రేయస్.. సెలబ్రేషన్స్ కూడా కాపీ పేస్టేనా? (Video)

కోల్‌కతా నైట్ రైడర్స్ పదేళ్ల నిరీక్షణకు తెరపడింది. దశాబ్దం తర్వాత ట్రోఫీని ముద్దాడింది. ఐపీఎల్ 2024 సీజన్ ఆరంభం నుంచి ఛాంపియన్‌లానే విజయాలతో దూసుకెళ్లిన కేకేఆర్ అంతిమంగానూ విజేతగా నిలిచింది. చెపాక్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఫైనల్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో ఘనంగా నెగ్గి టైటిల్ అందుకుంది. కోల్‌కతాకు ఇది మూడో ట్రోఫీ. 2012, 2014 సీజన్‌లోనూ కేకేఆర్ కప్‌ను అందుకుంది.

ఏకపక్షంగా సాగిన ఫైనల్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 18.3 ఓవర్లలోనే 113 పరుగులకు ఆలౌటైంది. ఐపీఎల్ ఫైనల్స్‌లో ఓ జట్టుకు ఇదే అత్యల్ప స్కోరు.కెప్టెన్ కమిన్స్ (24; 19 బంతుల్లో, 2x4, 1x6) టాప్ స్కోరర్. కోల్‌కతా బౌలర్లలో రసెల్ (3/19) మూడు, స్టార్క్ (2/14), హర్షిత్ రాణా (2/24) చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం ఛేదనలో కేకేఆర్ రెండు వికెట్లు కోల్పోయి 10.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని సాధించింది. వెంకటేశ్ అయ్యర్ (52; 26 బంతుల్లో, 4x4, 3x6) అజేయ అర్ధశతకం సాధించి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

Watch Shreyas Iyer Celebrates IPL Triumph with Messi-Inspired Gesture

వెంకటేశ్ అయ్యర్ విన్నింగ్ షాట్ ఆడిన తర్వాత స్టేడియం ఫైర్‌వర్క్‌‌తో కళకళలాడింది. డగౌట్ నుంచి కేకేఆర్ ఆటగాళ్లు, సిబ్బంది మైదానంలోకి దూసుకొచ్చారు. ఆనందంతో ఎగిరి గంతేశారు. జట్టును గెలిపించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్‌లను హగ్ చేసుకుని మురిసిపోయారు. అయితే ట్రోఫీని జట్టుకు అందిస్తూ శ్రేయస్ అయ్యర్ చేసిన సెలబ్రేషన్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

ట్రోఫీ సాధించిన అనంతరం ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ తన జట్టుతో కలిసి చేసిన సెలబ్రేషన్స్‌ను శ్రేయస్ అయ్యర్ కేకేఆర్‌తో సేమ్ టూ సేమ్ దించేశాడు. కొంచెం కూడా మార్పులేకుండా చక్కగా అనుకరించాడు. అయితే ఈ సెలబ్రేషన్స్‌ను కొందరు మెచ్చుకోగా, మరికొందరు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. మెస్సీని స్ఫూర్తిగా తీసుకుని కప్ సాధించారని కొందరు పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారు. మరికొందరు మాత్రం 'ఆర్సీబీ కప్ గెలిచి ఉంటే అసలైన సంబరాలు జరిగేవి', 'ఇదేందయ్యా ఇది.. సెలబ్రేషన్స్ కూడా కాపీ పేస్టేనా' అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

Story first published: Monday, May 27, 2024, 22:52 [IST]
Other articles published on May 27, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+