Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గుర్రం మీద సవారీ చేస్తున్న టీమిండియా క్రికెటర్ (వీడియో)

Watch: Shikhar Dhawan Learns Horse Riding Ahead Of Australia Series

హైదరాబాద్: భారత జట్టులో శిఖర్ ధావన్ ది విలక్షణమైన ప్రవర్తన. గబ్బర్ సింగ్ కు ఏమాత్రం తీసిపోకుండా ఉంటుంది ధావన్ ప్రవర్తన. సెంచరీ కొట్టిన తరువాత మీసాలు తిప్పడం, పిచ్చి పిచ్చిగా ఒంటి మీద టాటూలు వేసుకోవటం ధావన్‌కే చెల్లింది. అయితే ధావన్‌కు ఇప్పుడు గుర్రాల మీద మనసు పడినట్టుంది.

న్యూజిలాండ్ సిరీస్ తరువాత దొరికిన కాస్త ఖాళీ సమయంలో శిఖర్ ధావన్ ఈ విధంగా గుర్రం మీద సవారీ చేస్తూ కాలక్షేపం చేస్తున్నాడు. ఇటీవలే జరిగిన ఆస్ట్రేలియా టీ20 సిరీస్ లో ధావన్ మెరుపు బ్యాటింగ్ తో అలరించాడు. మొదటి మ్యాచ్ లో 76 పరుగులు , రెండవ మ్యాచ్ లో 41 పరుగులు చేసి ఫర్వాలేదని పించాడు.

అయితే వన్డే సిరీస్‌లో మాత్రం ధావన్ విఫలమయ్యాడు. అయితే న్యూజిలాండ్‌పై జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో మాత్రం బాగానే రాణించాడు. ధావన్ న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్ లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్ మెన్‌లలో రెండవ స్థానంలో నిలిచాడు.

ఫిబ్రవరి 24 నుంచి ఆస్ట్రేలియాకు భారత్‌కు మధ్య టీ20, వన్డే సిరీస్ జరగనున్నది. ధావన్ ఈ సిరీస్‌లో విఫలమైతే వరల్డ్ కప్ జట్టు ఎంపికలో ధావన్‌కు మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ మంచి కాంపిటీషన్ ఎదుర్కోవలసి వస్తుంది . అందుకే ధావన్ వీలైనన్ని పరుగులు సాధించి తన స్థానాన్ని పదిలం చేసుకోవాలనుకుంటున్నాడు.

Story first published: Tuesday, February 19, 2019, 15:18 [IST]
Other articles published on Feb 19, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+