
హైదరాబాద్: షాహిద్ అఫ్రిదిని అభిమానులు ముద్దుగా 'బూమ్ బూమ్' అని పిలుచుకునే సంగతి తెలిసిందే. ఈ పేరు అఫ్రిది విధ్వంసకర బ్యాటింగ్‌కు ముచ్చటపడి అభిమానులు పెట్టారు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అఫ్రిది ఆ పాత బూమ్ బూమ్ అఫ్రిదిని మరోసారి గుర్తు చేస్తూ పాకిస్థాన సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో చెలరేగిపోయాడు.
పాకిస్థాన్ సూపర్ లీగ్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని ఓ రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. టోర్నీలో భాగంగా గురువారం కరాచీ కింగ్స్-పెషవార్ జల్మీ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో షాహిద్ అఫ్రిది వరుసగా నాలుగు సిక్సర్లు బాది ఔరా అనిపించాడు. అఫ్రిది బాదిన మొదటి సిక్స్ అయితే స్టేడియం బయట పడటం విశేషం.
అఫ్రిది సిక్సర్లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 182 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కరాచీ కింగ్స్... అఫ్రిది మెరుపులు మెరిపించినప్పటికీ తన జట్టుని గెలిపించలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో కరాచీ కింగ్స్‌పై పెషవార్ జల్మీ జట్టు 44 పరుగుల తేడాతో విజయం సాధించింది.