Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అచ్చం ధోనీలాగే! రాస్‌టేలర్‌ను భలేగా రనౌట్ చేశాడు (వీడియో)

WATCH: Sam Billings pulls off MS Dhoni-like run-out to dismiss Ross Taylor in 5th T20I against New Zealand

హైదరాబాద్: ఇంగ్లాండ్ వికెట్ కీపర్ శామ్ బిల్లింగ్స్ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని తలపించాడు. అక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో టీ20లో రాస్ టేలర్(3)ను ధోనిలాగా రనౌట్ చేసి ఆశ్చర్యపరిచాడు. వివరాల్లోకి వెళితే...

న్యూజిలాండ్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ఆక్లాండ్ వేదికగా ఆదివారం జరిగిన ఐదో వన్డేకి వరుణుడు ఆటంకం కలిగించాడు. దీంతో మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించారు. ఈ నేపథ్యంలో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టులో మార్టిన్‌ గప్తిల్‌(50) హాఫ్ సెంచరీతో రాణించగా... కొలిన్‌ మన్రో(46), టిమ్‌ సీఫర్ట్‌(39) ఫరవాలేదనిపించారు.

146 పరుగులు చేసిన న్యూజిలాండ్

దీంతో నిర్ణీత ఓవర్లలో న్యూజిలాండ్ 146 పరుగులు చేసింది. అయితే, న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో రాస్ టేలర్ రనౌట్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ఇన్నింగ్స్‌ చివరి బంతికి రాస్‌టేలర్‌(3)ను ఇంగ్లాండ్‌ వికెట్ కీపర్ శామ్ బిల్లింగ్స్

రనౌట్‌ చేశాడు. అచ్చం ధోనీలాగా వికెట్లను చూడకుండా గిరాటేశాడు.

వీడియో వైరల్

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనంతరం 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేయడంతో మ్యాచ్‌ ‘టై' అయింది. ఇంగ్లాండ్ జట్టులో ఓపెనర్ జానీ బెయిర్‌స్టో(47) అద్భుత ప్రదర్శన చేశాడు.

సూపర్ ఓవర్ ఆడిన ఇరు జట్లు

దీంతో మ్యాచ్ విజేతను నిర్ణయించేందుకు సూపర్ ఓవర్‌ ఆడించారు. సూపర్ ఓవర్‌లో బెయిర్‌స్టో, మోర్గాన్‌ 17 పరుగులు చేయగా.. న్యూజిలాండ్‌ కేవలం 8 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడంతో ఐదు టీ20ల సిరిస్‌ను ఇంగ్లాండ్ 3-2తో కైవసం చేసుకుంది.

3-2తో సిరిస్ ఇంగ్లాండ్ కైవసం

అంతకముందు జరిగిన నాలుగు టీ20ల్లో ఇరు జట్లు చెరో రెండు మ్యాచ్‌లు గెలిచాయి. ఇదిలా ఉంటే, ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌ పైనల్లో కూడా రెండు జట్లు సూపర్ ఓవర్ ఆడాయి. సూపర్ ఓవర్‌లో కూడా పరుగులు సమం కావడంతో బౌండరీ రూల్ ఆధారంగా ఇంగ్లాండ్‌ను ఐసీసీ విజేతగా ప్రకటించింది.

Story first published: Monday, November 11, 2019, 15:28 [IST]
Other articles published on Nov 11, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+