న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఉమెన్స్ డే స్పెషల్: అమ్మ కోసం వంకాయకూర‌ వండిన స‌చిన్ (వీడియో)

Sachin Shares 'Sweet Gestures Of Love' On Women's Day, Cooks For His Mom | Oneindia Telugu
Watch: Sachin Tendulkar Shares Sweet Gestures Of Love On Womens Day, Cooks For His Mom

హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు క్రికెట్ లెజెండ్ సచిన్‌ టెండూల్కర్ కుక్ అవతారం ఎత్తి తన త‌ల్లిపై త‌న‌కున్న ప్రేమ‌ను చాటుకున్నాడు. శుక్ర‌వారం అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సందర్భంగా సచిన్ తన త‌ల్లికి ఇష్ట‌మైన వంకాయకూర చేసి త‌న చేతితో ఆ రుచిని చూపించాడు. స‌చినే స్వ‌యంగా కిచెన్‌లో వంకాయ కూర వండటం విశేషం.

లెప్ట్‌నెంట్ హోదాలో ధోని చేతుల మీదగా స్పెషల్ క్యాప్‌లతో కోహ్లీసేన (వీడియో)లెప్ట్‌నెంట్ హోదాలో ధోని చేతుల మీదగా స్పెషల్ క్యాప్‌లతో కోహ్లీసేన (వీడియో)

శుక్రవారం ఉమెన్స్ డే అని, మ‌న జీవితంలో విశేషంగా నిలిచిన మ‌హిళ‌ల‌కు ఏదైనా చేయాల‌ని సచిన్ త‌న మాట‌ల్లో చెప్పాడు. "ఈ మహిళా దినోత్సవం రోజున మన జీవితాల్లో ఉన్న అత్యంత ముఖ్యమైన మహిళల కోసం ఏదో ఒకటి ప్రత్యేకంగా చేద్దాం. ప్రేమతో వారికి ఏం చేశారో చెప్పండి" అంటూ సచిన్ వంట చేస్తున్న వీడియోను తన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.

మా అమ్మ కోసం

"ఈరోజు మా అమ్మ కోసం నేను ఆమెకిష్టమైన బైగాన్ భార్తా తయారు చేస్తున్నానుఠ అని సచిన్‌ చెప్పడంతో ఈ వీడియో మొదలవుతుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

త‌న ఆంటీ వాళ్ల ఇంటికి కూడా

మ‌రో వీడియోలో స‌చిన్ త‌న ఆంటీ వాళ్ల ఇంటికి కూడా వెళ్లాడు. చిన్న‌త‌నంలో అక్క‌డే ఎక్కువ‌గా గ‌డిపిన‌ట్లు ఆ వీడియోలో స‌చిన్ చెప్పుకొచ్చాడు. ఆంటీ త‌న‌కు అన్నీ వండి పెట్టేద‌ని.... స్కూల్ క్రికెట్ ఆడే రోజుల్లో ఎక్కువ శాతం ఆంటీ ఇంట్లోనే గ‌డిపిన‌ట్లు ఈ వీడియోలో సచిన్ అభిమానులతో చెప్పాడు.

మ‌రో ట్వీట్‌లో బీసీసీఐపై ప్ర‌శంస‌ల వ‌ర్షం

ఇక, మ‌రో ట్వీట్‌లో బీసీసీఐపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. మూడో వన్డేలో భారత్ ఆటగాళ్లు స్పెషల్ ‘ఆర్మీ' క్యాప్ ధరించి మ్యాచ్ ఆడారు. పుల్వామా ఉగ్ర‌దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమ‌ర జ‌వాన్ల‌కు నివాళిగా ఆర్మీ క్యాప్‌లను భారత జట్టులోని ఆటగాళ్లు ధరించారు. బీసీసీఐ లోగోతో ప్రత్యేకంగా రూపొందించిన ఈ క్యాప్‌లను భారత ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ (గౌరవ) హోదాలో ఉన్న ధోనీ మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లకి అందజేశాడు.

టాస్ అనంతరం కోహ్లీ వెల్లడి

ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోను రీట్వీట్ చేసిన స‌చిన్‌.. త‌న గుండెను ఇది ట‌చ్ చేసింద‌ని ట్వీట్ చేశాడు. మరోవైపు ఈ మ్యాచ్ ద్వారా వచ్చే మొత్తాన్ని నేష‌న‌ల్ డిఫెన్స్ ఫండ్‌కు విరాళంగా ఇవ్వనున్నట్లు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ అనంతరం వెల్లడించాడు. ఈ నిధులను పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జ‌వాన్ల పిల్ల‌ల చ‌ద‌ువు కోసం వినియోగించనున్నారు.

Story first published: Saturday, March 9, 2019, 13:56 [IST]
Other articles published on Mar 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X