బ్రబౌర్న్ స్టేడియంలో 4వ వన్డే: గంట కొట్టిన సచిన్ టెండూల్కర్ (వీడియో)

హైదరాబాద్: ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య 4వ వన్డే ప్రారంభమైంది. క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా(సీసీఐ)కు చెందిన స్టేడియంలో జరుగుతున్న ఈ 4వ వన్డేకి ముందు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఆరంభ గంటను మ్రోగించి మ్యాచ్‌ని ప్రారంభించారు.
మ్యాచ్‌కు ముందు ఆరంభ గంటను కొట్టే సంప్రదాయం ఇంగ్లాండ్‌లోని చరిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంలో మొదలైంది. భారత్‌లో కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్‌లోనూ ఈ గంట కొట్టే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఏదైనా టెస్టు మ్యాచ్ ప్రారంభమయ్యే రోజున ప్రముఖ క్రికెటర్లను గంట కొట్టేందుకు ఆహ్వానిస్తుంటారు.
మ్యాచ్‌కు ముందు సచిన్ ఆరంభ గంటను
తాజాగా 4వ వన్డేకి ముందు బ్రబౌర్న్ స్టేడియంలో ఈ సంప్రదాయానికి తెరలేపారు. మ్యాచ్‌కు ముందు సచిన్ ఆరంభ గంటను మ్రోగించిన వీడియోని బీసీసీఐ తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. నిజానికి ఈ మ్యాచ్ వాంఖడె మైదానంలో జరగాలి. కానీ, ఆర్థిక అవరోధాలను చూపుతూ ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) ఈ మ్యాచ్‌ని నిర్వహించలేమని చేతులెత్తేసింది. దీంతో సుప్రీం కోర్టు నియమించిన పాలకుల కమిటీ ఆదేశాల మేరకు క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా(సీసీఐ) స్టేడియానికి బీసీసీఐ మార్చింది.
చివరిసారిగా 2006లో వన్డే మ్యాచ్
1937లో ప్రారంభమైన ఈ మైదానంలో చివరిసారిగా 2006లో వన్డే మ్యాచ్ జరిగింది. అయితే టీమిండియా మాత్రం ఈ స్టేడియంలో వన్డే మ్యాచ్ ఆడటం 23ఏళ్ల తర్వాత తొలిసారి కావడం విశేషం. బ్రబౌర్న్ స్టేడియం కూడా వాంఖడెకు అతి సమీపంలోనే ఉండటం విశేషం. నిజానికి బ్రబౌర్న్ స్టేడియం నిర్వాహకులు, క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా(సీసీఐ) మధ్య తరచూ వివాదాలు జరుగుతుంటాయి. దీంతో 1970ల నుంచి ముంబైలో అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహించాలంటే ముంబయి క్రికెట్ అసోసియేషన్ వాంఖడే స్టేడియాన్ని ఎంచుకోవడం విశేషం.

బ్రబౌర్న్ మైదానంలో టీమిండియా ఒకే ఒక్క వన్డే
బ్రబౌర్న్ మైదానంలో టీమిండియా ఒకే ఒక్క వన్డే ఆడింది. 1995లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 1995 తర్వాత మళ్లీ టీమిండియా ఈ మైదానంలో ఆడలేదు. 2006లో ఆస్ట్రేలియా, వెస్టిండిస్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో వెస్టిండిస్‌ను ఓడించి ఆస్ట్రేలియా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ దక్కించుకుంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
బ్రబౌర్న్ స్టేడియంలో ఇప్పటివరకు 18 టెస్టులు, 8 వన్డేలు, ఒక్క టీ 20 మ్యాచ్ జరిగింది. ఈ స్టేడియంలో జరిగిన మొత్తం 18 టెస్టుల్లో 11 టెస్టుల్లో ఫలితం తేలలేదు. ఇక్కడ 7 టెస్టుల్లో ఐదింటిలో భారత్ విజయం సాధించగా.. వెస్టిండిస్, ఆస్ట్రేలియా చెరొకటి గెలిచాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications