న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మళ్లీ మైదానంలో అడుగుపెట్టిన శ్రీశాంత్..!

Watch: S Sreesanth returns to the cricket field

హైదరాబాద్: సోషల్ మీడియాలో ఈ మధ్య తరచుగా అప్‌డేట్స్ ఇస్తోన్న ఫాస్ట్‌ బౌలర్‌ శ్రీశాంత్ ఈ సారి తన పాత గెటప్‌లో మళ్లీ ముందుకొచ్చాడు. స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో పాటు బీసీసీఐ నిషేధాన్ని ఎదుర్కొంటోన్న శ్రీశాంత్‌ మైదానంలో అడుగుపెట్టాడు. ఐతే, ఇది అధికారిక మ్యాచ్‌ల్లో మాత్రం కాదండోయ్‌. ఏదో క్లబ్‌ తరఫున ఆడేందుకు శ్రీశాంత్‌ సిద్ధమయ్యాడు. అది ఎక్కడ, ఎప్పుడు అనేది మాత్రం తెలియరాలేదు.

తాజాగా శ్రీశాంత్‌ తన ఇన్‌స్టాగ్రాంలో మ్యాచ్‌లో ఆడిన ఫొటోలను, వీడియోలను అభిమానులతో పంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో శ్రీశాంత్‌ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌ కూడా చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. 'టీమిండియాలోకి ఎప్పుడు వస్తున్నావు; ఆల్‌ ద బెస్ట్‌' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 2013లో ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌లో పాల్పడినట్లు శ్రీశాంత్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

#discipline #Cricket

A post shared by Sree Santh (@sreesanthnair36) on

దీంతో బీసీసీఐ అతడిపై నిషేధం విధించింది. బీసీసీఐ నిషేధాన్ని సవాలు చేస్తూ శ్రీశాంత్‌ కోర్టును ఆశ్రయించాడు. కేరళ హైకోర్టు నిషేధాన్ని ఎత్తివేస్తూ తీర్పును వెలువరించింది. కానీ, బీసీసీఐ మాత్రం ఇప్పటి వరకు అతనిపై నిషేధాన్ని ఎత్తివేయని సంగతి తెలిసిందే. 2011 ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో శ్రీశాంత్‌ సభ్యుడు. ఇప్పటి వరకు భారత్‌ తరఫున శ్రీశాంత్‌ 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20లు ఆడాడు.

కొద్ది నెలల ముందే సినిమా రంగంలో అడుగుపెట్టిన శ్రీశాంత్.. ఇప్పటికే నాలుగు సినిమాలు పూర్తి చేసుకోగా ఐదో సినిమా కోసం కసరత్తులు చేస్తున్నాడు. ఇలా సిక్స్ ప్యాక్‌తో ఉన్న ఫొటోలు కూడా పంచుకున్నాడు. క్రికెట్‌లో రాణించినంతగా సినిమా రంగంలో విజయాలు దక్కకపోయినా అదే ఆత్మవిశ్వాసంతో మరింత నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.

Story first published: Friday, August 10, 2018, 12:43 [IST]
Other articles published on Aug 10, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X