టార్గెట్ రోహిత్ శర్మ తల: బంతి విసిరిన ఆసీస్ కీపర్ (వీడియో)
హైదరాబాద్: హెల్మెట్ ధరించడం ఎంత ముఖ్యమో... అందుకు సంబంధించిన ఓ ఘటన బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో చోటు చేసుకుంది. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా నాలుగో వన్డే గురువారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగింది.

భారత్‌పై 21 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం
ఈ వన్డేలో అతిథ్య భారత్‌పై ఆస్ట్రేలియా 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. 335 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 313 పరుగులు చేసింది. అయితే ఈ సిరిస్ ఆరంభం నుంచీ
ఆసీస్ వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ కొంచెం దురుసుగానే ప్రవర్తిస్తున్నాడు.

రోహిత్ శర్మపైకి బంతి విసిరిన వేడ్
ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన రెండో వన్డేలో విరాట్ కోహ్లీతో స్లెడ్జింగ్‌కు దిగాడు. నాలుగో వన్డేలో ఓపెనర్ రోహిత్ శర్మపైకి ప్రమాదకరంగా బంతి విసిరి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. అయితే.. బంతి రోహిత్ శర్మ శరీరానికి కాకుండా తలపై ఉన్న హెల్మెట్‌పై పడటంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

అసలేం జరిగింది?
ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో ఫీల్డర్ అందించిన బంతిని.. బౌలర్ ట్రావిస్ హెడ్‌కి అందించే ఉద్దేశంతో మాథ్యూ వేడ్ స్ట్రైకింగ్ ఎండ్ నుంచి విసిరాడు. సాధారణంగా వికెట్ కీపర్ బంతి డెడ్ అయిన తర్వాత కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఫీల్డర్‌కి ఇచ్చి బౌలర్‌కి అందేలా చేస్తాడు. అలా కాకుండా బౌలర్.. పిచ్ మధ్యలో ఉంటే నేరుగా కీపరే విసురుతాడు.
బంతిని విసిరి భారత అభిమానుల ఆగ్రహానికి
కానీ.. ఇక్కడ అంపైర్‌కి వెనకవైపు ఉన్న బౌలర్‌కి.. కీపర్ గ్లౌవ్స్ వేసుకుని మరీ గురి తప్పకుండా బంతిని విసరడం కష్టం. అయితే మాథ్యూ వేడ్ ఏ మాత్రం ఆలోచించకుండా బంతిని విసిరి భారత అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో మాథ్యూ వేడ్ తీరుపై ప్రత్యక్షంగా చూసిన ఓపెనర్ రహానే ఒకింత అసహనం వ్యక్తం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications