For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చూడండి: చాహల్, కుల్దీప్‌లతో రోహిత్ శర్మ కొత్త రోల్

ఆస్ట్రేలియాతో ముగిసిన ఐదు వన్డేల సిరీస్‌లో తన అద్భుతమైన బౌలింగ్‌తో భారత్‌కు విజయాలనందించిన కుల్దీప్ యాదవ్‌కి బాలీవుడ్ హీరోయిన్ జాక్వలైన్ ఫెర్నాండేజ్ అంటే తెగ ఇష్టమట.

By Nageshwara Rao

హైదరాబాద్: ఆస్ట్రేలియాతో ముగిసిన ఐదు వన్డేల సిరీస్‌లో తన అద్భుతమైన బౌలింగ్‌తో భారత్‌కు విజయాలనందించిన కుల్దీప్ యాదవ్‌కి బాలీవుడ్ హీరోయిన్ జాక్వలైన్ ఫెర్నాండేజ్ అంటే తెగ ఇష్టమట. ఈ విషయాన్ని కుల్దీప్ స్వయంగా వెల్లడించాడు.

Watch: Rohit Sharma gets candid with spin twins Kuldeep Yadav, Yuzvendra Chahal

నాగ్‌పూర్ వేదికగా ఆదివారం ముగిసిన ఐదు వన్డేల సిరీస్‌ని భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో తన అద్భుతమైన బౌలింగ్‌తో కుల్దీప్ అందరి ప్రశంసలు అందుకున్నాడు. కుల్దీప్ పాటు తన మణికట్టు బౌలింగ్‌తో సిరీస్‌లో రాణించిన చాహల్‌‌ని ఓపెనర్ రోహిత్ శర్మ సరదాగా ఇంటర్వ్యూ చేశాడు.

ఈ సందర్భంగా రోహిత్ శర్మ అడిగిన ప్రశ్నలకి ఈ స్పిన్నర్లు ఇద్దరూ సమాధానమిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.

రోహిత్‌ శర్మ: మహిళాభిమానులు ఎదురైతే
చాహల్‌: నాకు పరిచయంలేని అమ్మాయి ఎవరైనా ఎదురైతే మాట్లాడకుండా వెళ్లిపోతాను. 5 లేదా 6 సంవత్సరాలు పరిచయం ఉంటే అప్పుడు మాట్లాడతాను. నాకు చాలా మొహమాటం. మొదటిసారి నాకు ఎవరైనా కొత్తవారు ఎదురైతే కొంచెం నవ్వి మాట్లాడకుండా పక్క నుంచి వెళ్లిపోతాను.
కుల్దీప్‌: నేను ఎక్కువగా ఎవరితో మాట్లాడను. తెలిసిన వాళ్లు ఎవరైనా ఉంటే కొద్దిసేపు మాత్రమే మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోతాను. పాఠశాల రోజుల్లో సైతం నా దృష్టి ఎక్కువ ప్రాక్టీస్‌ పైనే ఉండేది.


రోహిత్‌ శర్మ: క్రికెట్‌ షెడ్యూల్‌ లేని సయమంలో ఏం చేస్తారు?
చాహల్‌: నాకు ఇంట్లో కూర్చోవడం అంటే ఇష్టం ఉండదు. పార్టీలు ఏమీ లేకపోతే డిన్నర్‌ చేసేందుకు బయటికి వెళ్లేందుకు ఇష్టపడతా. పెద్ద శబ్దంతో మ్యూజిక్‌ వచ్చే ప్రదేశానికి వెళ్లడం అంటే ఇష్టం.
కుల్దీప్‌: నాకు బయటికి వెళ్లడం అంతగా నచ్చదు. ఇంట్లో ఉండేందుకే ఎక్కువ ఇష్టపడతా. నాకు సాకర్‌ క్రీడ అంటే చాలా ఇష్టం. దాన్ని చూసేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తా. చిన్నప్పుడు సాకర్‌ ఆడే సమయంలో పలుమార్లు గాయాలపాలయ్యాను. అప్పట్నుంచి ఆ ఆట ఆడటమంటే భయం.


రోహిత్ శర్మ: మీ అభిమాన హీరోయిన్?
చాహల్: కత్రినా కైఫ్
కుల్దీప్ : జాక్వలైన్ ఫెర్నాండేజ్


రోహిత్ శర్మ: ఏ కారు మీ వద్ద ఉండాలనుకుంటున్నారు?
చాహల్: పోర్స్చే, ఏ మోడల్ అయినా సరే, చివరికి సెకండ్-హ్యాండ్ కారు అయినా ఫరవా లేదు.
కుల్దీప్: 1990నాటి ఫోర్డ్ ముస్తాంగ్.


రోహిత్: డ్రీమ్ డేట్‌ కోసం ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారు?
చాహల్: బొరబొర ఐలాండ్స్ (ఫ్రెంచ్)
కుల్దీప్: పారిస్ అంటే నాకు చాలా ఇష్టం.


రోహిత్: మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఎవరి నంబరు ఉండాలనుకుంటున్నారు?
చాహల్: ది రాక్
కుల్దీప్: నెయమార్ జూనియర్

ఇదిలా ఉంటే ఇరు జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ రాంచీ వేదికగా శనివారం జరగనుంది.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+