
ఫేక్ అకౌంట్స్‌తో..
ధనశ్రీ వర్మ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన ఒకట్రెండు అంశాలు.. ఈ తరహా పుకార్లకు కారణం అయ్యాయి. తొలుత ఆమె తన పేరు నుంచి చాహల్ అనే పదాలను తొలగించింది. ఆ తరువాత న్యూ లైఫ్ లోడింగ్.. అనే ఓ ఫొటోను పోస్ట్ చేసింది. దీనితో వారిద్దరూ విడిపోబోతున్నారంటూ వదంతులు వ్యాపించాయి. అదే సమయంలో ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ఫేక్ అకౌంట్‌ను సృష్టించిన కొందరు యూజర్లు అందులో కూడా ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. దీనితో అది నిజం అని నమ్మారు.

పర్సనల్ లైఫ్ డిస్టర్బ్..
అవి ఫేక్ అంటూ నెత్తీనోరు బాదుకున్నప్పటికీ.. ఎవరూ వినిపించుకోలేదు. సోషల్ మీడియాలో వెల్లువెత్తిన ఈ సమాచారం ఫేక్ అంటూ నిరూపించుకోవడానికి వారిద్దరూ ప్రత్యేకంగా కొన్ని వీడియోలను సైతం పోస్ట్ చేయాల్సి వచ్చింది. హేట్ ఫుల్, హర్ట్ ఫుల్ అంటూ చాహల్-ధనశ్రీ వర్మ కామెంట్స్ పెట్టారు. అలాంటి వార్తల వల్ల తమ వ్యక్తిగత జీవితం డిస్టర్బ్ అయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ- వాటికి బ్రేక్ పడలేదు.
రోహిత్ రియాక్ట్
దీనిపై తాజాగా భారత క్రికెట్ జట్టు కేప్టెన్ రోహిత్ శర్మ రియాక్ట్ అయ్యాడు. యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీ వర్మ విడిపోతున్నారంటూ వదంతులు పుట్టించిన వారెవరంటూ ఆరా తీశాడు. ఈ విషయాన్ని అతను నేరుగా జర్నలిస్టులనే నిలదీశాడు. బతావో. కౌన్ హై అంటూ ప్రశ్నించాడు. ఆ సమయంలో యుజ్వేంద్ర చాహల్ అతని పక్కనే ఉన్నాడు. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో టీమిండియా ప్రాక్టీస్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.

పుకార్లు పుట్టించిందెవరు..?
గ్రౌండ్‌లో రోహిత్ శర్మ, చాహల్, ఫిజియోథెరపిస్ట్ ఉండటాన్ని చూసిన కొందరు భారత విలేకరులు వారిని చుట్టుముట్టారు. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఎలా సన్నద్ధమౌతున్నారంటూ ప్రశ్నించాడు. దీనికి రోహిత్ శర్మ బదులివ్వలేదు గానీ.. ఎదురు ప్రశ్నలు గుప్పించాడు. యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీ వర్మ వ్యక్తిగత జీవితంపై పుకార్లు పుట్టించి ఎవరంటూ నిలదీశాడు. వేలు ఎత్తి మరీ ప్రశ్నించాడు. అనూహ్యమైన ఈ ఘటనతో విలేకరులు బిత్తరపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఒకరిపై ఒకరు
ఆ వదంతులు పుట్టించిన జర్నలిస్ట్ ఇక్కడే ఉన్నాడంటూ తోటి వారు సమాధానం ఇవ్వడం ఈ వీడియోలో రికార్డయింది. ఇతనే పోస్ట్ చేశాడంటూ ఓ జర్నలిస్ట్ గురించి చెప్పడం వినిపించింది. దీనికి అతను- తానేమీ చేయలేదని, అలాంటి పోస్టులేవీ షేర్ చేయలేదంటూ సమాధానం ఇచ్చాడు. కొద్దిసేపటి తరువాత జర్నలిస్టులతో ఆసియా కప్ టోర్నమెంట్‌కు సంబంధించిన విషయాలేవీ మాట్లాడకుండా ముగ్గురూ వెళ్లిపోయారు.


Click it and Unblock the Notifications












