వీడియో వైరల్: ధావన్ కుమారుడు జొరావర్‌తో రిషబ్ పంత్ 'బేబిసిట్టింగ్'


హైదరాబాద్: ఈ ఏడాది ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ 'బేబి సిట్టర్'గా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ పిల్లలను ఎత్తుకొని ఆడించడంతో టిమ్ పైన్ భార్య పంత్ మంచి బేబిసిట్టర్ అంటూ ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆ పర్యటనలోనే రోహిత్ శర్మ భార్య పండంటి అమ్మాయికి జన్మించడం... రోహిత్ సైతం పంత్‌ను తన కుమార్తెకు బేబిసిట్టర్‌గా ఉంటావా? అంటూ ట్విట్టర్‌లో అడగటాన్ని మనం చూశాం...
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఐపీఎల్‌లో బేబిసిట్టర్‌గా పంత్
ఈ క్రమంలో రిషబ్ పంత్‌కు బేబిసిట్టింగ్‌లో మంచి పేరు వచ్చింది. ఐపీఎల్ 2019 సీజన్‌లో భాగంగా శుక్రవారం రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ అనంతరం రిషబ్ పంత్ మరోసారి ‘బేబిసిట్టర్' గా మారిపోయాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ కొడుకు జొరావర్‌ను పంత్ సరదాగా ఆటపట్టించాడు.

జోరావర్‌ను టవల్‌లో వేసుకొని గిరిగిరా తిప్పిన రిషబ్ పంత్
చిన్నారి జోరావర్‌ను రిషబ్ పంత్ టవల్‌లో వేసుకొని గిరిగిరా తిప్పాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే, 179 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 18.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 180 పరుగుు చేసింది. దీంతో ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఢిల్లీ క్యాపిటల్స్ విజయ లక్ష్యం 179
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఓపెనర్ శిఖర్ ధావన్ 63 బంతుల్లో 97 (11 ఫోర్లు, 2 సిక్సులు) తృటిలో సెంచరీ మిస్సయ్యాడు. 179 పరుగుల లక్ష్య చేధనలో ఢిల్లీ క్యాపిటల్స్ మూడో ఓవర్‌లోనే తొలి వికెట్ కోల్పోయింది. ప్రశిద్ధ్ కృష్ణ వేసిన ఈ ఓవర్‌లో పృథ్వీ షా వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం ఆండ్రీ రస్సెల్ వేసిన ఆరో ఓవర్ 4వ బంతికి శ్రేయస్(6) కూడా కార్తీక్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

32వ హాఫ్ సెంచరీని నమోదు చేసిన శిఖర్ ధావన్
ఈ దశలో క్రీజులోకి దిగిన రిషబ్ పంత్, మరో ఓపెనర్ శిఖర్ ధావన్‌తో కలిసి స్కోరు బోర్డుని నడిపించాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కి 105 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఓపెనర్ శిఖర్ ధావన్ ఐపీఎల్‌లో 32వ హాఫ్ సెంచరీని సాధించాడు. అదే సమయంలో రిషబ్ పంత్(46) నితీశ్ రానా బౌలింగ్ కుల్దీప్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన కొలిన్ ఇన్‌గ్రామ్(14)తో కలిసి ధావన్ దూకుడుగా ఆడి ఆడటంతో ఢిల్లీ క్యాపిటల్స్ 18.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications