Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జమైకాలో రవిశాస్త్రి నోటి వెంట పాట: ఎవరీ బాబ్ మార్లే (వీడియో)

Watch: Ravi Shastri attempts to sing Bob Marleys iconic Buffalo Soldier

హైదరాబాద్: భారత్, వెస్టిండిస్ జట్ల మధ్య రెండో టెస్టు జమైకాలోని కింగ్‌స్టన్ స్టేడియంలో గురువారం నుంచి ఆరంభం కానుంది. అయితే, రెండో టెస్టు ముందు కాస్త విరామం లభించడంతో భారత జట్టులోని ఆటగాళ్లు కరేబియన్ దీవుల్లో సేదతీరగా... హెడ్ కోచ్ రవిశాస్త్రి తన సహాయక బృందంతో కలిసి ప్రఖ్యాత బాబ్ మార్లే మ్యూజియాన్ని సందర్శించాడు.

మార్కే మ్యూజిక్ అంటే తెలియని వెస్టిండియన్ ఉండడు. తన మ్యూజి‌క్‌తో 70 దశకాల్లో ఊర్రూతలూగించాడు. ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా వెస్టిండిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. రెండో టెస్టు కోసం జమైకాకు చేరుకుంది. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్‌లు జమైకాలోని బాబ్ మార్లే మ్యూజియాన్ని సందర్శించారు.

బాబ్ మార్లే మ్యూజిక్‌తో

బాబ్ మార్లే మ్యూజిక్‌తో

ఈ సందర్భంగా బాబ్ మార్లే మ్యూజిక్‌తో తనకున్న జ్ఞాపకాలను హెడ్ కోచ్ రవిశాస్త్రి బీసీసీఐ.టీవీతో పంచుకున్నాడు. "మీరు జమైకాలోని ‌కింగ్‌స్టన్‌లో ఉన్నప్పుడు మీరు తప్పక చూడవలసిన ఒక ప్రదేశం. జమైకాను వరల్డ్ మ్యాప్‌లో ఉంచిన వ్యక్తి యొక్క మ్యూజియం... ఇప్పటివరకు జన్మించిన ఇతర వ్యక్తుల కంటే ఎక్కువ. బాబ్... బాబ్ మార్లే, ది లెజెండ్" అని అన్నాడు.

పాట పాడిన రవిశాస్త్రి

బాబ్ మార్లే మ్యూజియంను సందర్శిన సమయంలో బాబ్ మార్లే ఐకానిక్ బఫెలో సోల్జర్ పాటను రవిశాస్త్రి పాడాడు కూడా. అదే సమయంలో 1983లో వెస్టిండిస్ పర్యటనకు వచ్చిన జట్టులో రవిశాస్త్రి సభ్యుడిగా ఉన్నాడు. రవిశాస్త్రి మాట్లాడుతూ "నిజగా.. ఇది మనస్సును హత్తుకునే విషయం. నాకైతే.. 37 ఏళ్ల తర్వాత మళ్లీ జమైకాలో అడుగుపెట్టాను. తొలిసారి 21 ఏళ్ల వయసులో వెస్టిండిస్ జట్టుతో ఆడేందుకు నేను 1983లో ఇక్కడికి వచ్చాను. మార్లే మ్యూజిక్ అద్బుతం" అని సంతోషం వ్యక్తం చేశాడు.

రెగె సంగీతకారుల్లో బాబ్ మార్లే ఒకడు

రెగె సంగీతకారుల్లో బాబ్ మార్లే ఒకడు

"ఆ సమయంలో కొంతమంది గొప్ప రెగె సంగీతకారులు ఉండేవారు... అయితే, ఒకే ఒక్క కింగ్ మాత్రం అందరికంటే ఎంతో ఎత్తులో ఉండేవాడు. మైదానానికి వెళ్లే సమయంలో... ఆ మ్యూజిక్‌ను వింటే... అవి అచ్చం స్వచ్చమైన సాంగ్స్ మాదిరి ఉండేవి. అవి స్ఫూర్తిదాయకమైనవి. వెస్టిండీస్‌తో ఆడేందుకు అవే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాయి" అని రవిశాస్త్రి తెలిపాడు.

కానరాని సంజయ్ బంగర్

కానరాని సంజయ్ బంగర్

అయితే, రవిశాస్త్రితో పాటు టీమిండియా బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ఈ మ్యూజియాన్ని సందర్శించేందుకు రాలేదు. ఇటీవలే టీమిండియా సెలక్షన్ ఇంటర్వ్యూలో తిరిగి ఎంపికైన బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్‌లు మాత్రమే రవిశాస్త్రి వెంట ఉన్నారు. ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సంజయ్ బంగర్ స్థానంలో విక్రమ్ రాథోర్‌ని ఎంపిక చేసింది.

Story first published: Friday, August 30, 2019, 16:00 [IST]
Other articles published on Aug 30, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+