Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ గిప్ట్‌గా ఇచ్చిన స్పెషల్ బ్యాట్‌ని ఎలా దొంగిలించారంటే!: రషీద్ ఖాన్

Watch: Rashid Khan Reveals How Afghan Teammate Stole Special Bat Given To Him By Virat Kohli

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నుంచి తాను గిప్ట్‌గా అందుకున్న బ్యాట్‌ని ఆప్ఘనిస్థాన్ కెప్టెన్ అస్గర్‌ అఫ్గన్ దొంగిలించాడని అదే జట్టుకు చెందిన రషీద్ ఖాన్ తెలిపాడు. ఐసీసీ వరల్డ్‌కప్ టోర్నీలో భాగంగా శనివారం సాయంత్రం 6 గంటలకు ఆప్ఘనిస్థాన్ జట్టు ఆస్ట్రేలియాతో తలపడనుంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

1
43646

కోహ్లీ గిప్ట్‌గా ఇచ్చిన బ్యాట్‌ను

కోహ్లీ గిప్ట్‌గా ఇచ్చిన బ్యాట్‌ను

ఈ నేపథ్యంలో రషీద్‌ ఖాన్ ఆస్ట్రేలియా మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో కోహ్లీ గిప్ట్‌గా ఇచ్చిన బ్యాట్‌ను ఎలా పొగొట్టుకున్నాడన్న విషయాన్ని వివరించాడు. ఈ సందర్భంగా రషీద్ మాట్లాడుతూ "నాకు బ్యాట్స్ సేకరించడం అలవాటు. కోహ్లీ, డేవిడ్ వార్నర్, కేఎల్ రాహుల్ లాంటి క్రికెటర్ల దగ్గర నుంచి బ్యాట్స్‌ని గిఫ్ట్‌గా పొందాను" అని అన్నాడు.

ఆ బ్యాట్స్‌తో ఎక్కువ పరుగులు చేస్తా

ఆ బ్యాట్స్‌తో ఎక్కువ పరుగులు చేస్తా

"ఈ బ్యాట్స్‌తోనే నేను వరల్డ్‌కప్‌లో ఆడాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ బ్యాట్స్‌తో ఎక్కువ పరుగులు చేస్తాను. ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ ఇచ్చిన బ్యాట్‌తో ఆడాను. అప్పుడు.. ఆ బ్యాట్‌తో ఎక్కువ పరుగులు చేశాను. నేను ఫోర్ కోసం ప్రయత్నిస్తే అది సిక్స్ వెళ్లింది" అని రషీద్ ఖాన్ తెలిపాడు.

బ్యాట్ తీసుకుని అతని బ్యాగ్‌లో పెట్టుకున్నాడు

బ్యాట్ తీసుకుని అతని బ్యాగ్‌లో పెట్టుకున్నాడు

"మ్యాచ్ అనంతరం నేను పెవిలియన్‌కి వెళ్లాక మా జట్టు కెప్టెన్ అస్గర్‌ అఫ్గాన్‌ నా బ్యాట్ తనకివ్వమని అడిగాడు. నేను ఇవ్వను అని చెప్పా. అయినా సరే నా బ్యాగ్‌లో నుంచి బ్యాట్ తీసుకుని అతని బ్యాగ్‌లో పెట్టుకున్నాడు. ఆ బ్యాట్ నాకు గిప్ట్‌గా ఇచ్చారని, తప్పకుండా ఆ బ్యాట్ నా వద్దకే తిరిగి చేరుతుంది" అని రషీద్ ఖాన్ అన్నాడు.

Story first published: Saturday, June 1, 2019, 15:38 [IST]
Other articles published on Jun 1, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+