Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రీతి జింతానే కాదు.. ముంబై ఓటమి అనంతరం రాజస్థాన్ సంబరాలు(వీడియో)

Watch | Rajasthan Royals Camp Ecstatic After Qualifying for Knockout Stage

హైదరాబాద్: లీగ్ దశలో టాప్ 4లో నిలిచిన జట్లే ప్లేఆఫ్ రేసులో నిలబడనున్న నేపథ్యంలో భీకర యుద్ధమే జరిగింది. కొద్ది మ్యాచ్‌లు ముందుగానే తొలి రెండు స్థానాలను సుస్థిరం చేసుకున్న హైదరాబాద్, చెన్నైలు కాకుండా మిగిలిన జట్లు తీవ్రతరంగా పోటీపడ్డాయి. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగిన రెండు మ్యాచ్‌లలో ఢిల్లీ వర్సెస్ ముంబై, చెన్నై వర్సెస్ పంజాబ్ మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భాగంగా ఢిల్లీ గెలిస్తే ముంబై ప్లేఆఫ్ రేసులో స్థానం కోల్పోతుంది. ఒకవేళ ఓడితే ముంబైకి దక్కుతుంది.

మరో పక్క ఉన్న ఒక్క స్థానాన్ని ముంబై తన్నుకుపోతే పంజాబ్‌కు ప్లేఆఫ్ ఆశలు కరువైనట్లే. ఆ తరుణంలో ప్రీతి జింతా కూడా ముంబై ఓటమిపై హర్షం వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే, అప్పటికీ పంజాబ్ గెలుస్తుందనే నమ్మకాలు లేకపోవడంతో రాజస్థాన్ జట్టు దాదాపు ప్లేఆఫ్ రేసుకు అర్హత సాధించేశామని సంబరాలు చేసుకుంది.

దీంతో రాజస్తాన్‌ ఆటగాళ్ల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ముంబై మ్యాచ్‌ను ఆసక్తికరంగా తిలకించిన రాజస్తాన్‌ ఆటగాళ్లు ఓటమి అనంతరం గెంతులేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఆ జట్టు ఫ్రాంచైజీ అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.

కింగ్స్‌ పంజాబ్‌ సైతం చెన్నై సూపర్‌ కింగ్స్‌ చేతిలో ఓడిపోవడంతో వారి ఆనందం రెట్టింపైంది. టోర్నీ నుంచి ఈ రెండు జట్లు నిష్క్రమించడంతో రాజస్తాన్‌ ప్లే ఆఫ్‌కు అర్హత సాధించింది. బుధవారం ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టుతో రాజస్తాన్‌ ఎలిమినేటర్‌ మ్యాచ్‌ ఆడనుంది.

Story first published: Tuesday, May 22, 2018, 13:26 [IST]
Other articles published on May 22, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+