
హైదరాబాద్: శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా క్రికెటర్ క్వింటన్ డీకాక్ చేసిన ఓ రనౌట్ టీమిండియా వికెట్ కీపర్ ధోనీని తలపించింది. తన చిట్టచివరి లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆసీస్‌ను ఖంగు తినిపించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సపారీలు 10 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకున్నారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
అయితే, ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్ డికాక్ అచ్చం ధోనీ మాదిరి రనౌట్ చేసి ఆశ్చర్యపరిచాడు. మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఆస్ట్రేలియాను డేవిడ్ వార్నర్-మార్కస్ స్టోనిస్‌ల ఆదుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే, డీకాక్ చేసిన రనౌట్ మ్యాచ్‌ని మలుపు తిప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు.. 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 325 పరుగులను చేసింది. భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఆస్ట్రేలియా టీమ్ చివరికంటా పోరాడింది గానీ విజయాన్ని అందుకోలేకపోయింది. 49.5 ఓవర్లలో 315 పరుగులకు ఆలౌటైంది. ఈ ఓటమితో ఆస్ట్రేలియా పాయింట్ల పట్టికలో రెండోస్థానానికి దిగజారగా... లంకపై విజయం సాధించిన కోహ్లీసేన అగ్రస్థానంలో నిలిచింది.
దీంతో సెమీస్‌లో ప్రత్యర్ధులు ఒక్కసారిగా మారారు. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్ (11 పాయింట్లు)తో మంగళవారం మొదటి సెమీఫైనల్ పోరుకు భారత్ సిద్ధమైంది. లీగ్ దశను రెండో స్థానం (14 పాయింట్లు)తో ముగించిన ఆస్ట్రేలియా.. మూడో స్థానంలో నిలిచిన ఇంగ్లాండ్ (12)తో గురువారం రెండో సెమీఫైనల్లో తలపడనుంది.