రోహిత్‌కు రెండు లైఫ్‌లు: చేతిలో పడిన క్యాచ్ మిస్ చేశాడు (వీడియో)

హైదరాబాద్: నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య బుధవారం నుంచి మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ఈ టెస్టు మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా జట్టు మేనేజ్‌మెంట్ ప్రకటించిన తుది జట్టులో పీటర్ సిడ్డిల్‌కు చోటు దక్కలేదు. అయితే, ఆటలో భాగంగా రెండో రోజైన గురువారం పీటర్ సిడ్డిల్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచాడు.
అందుకు కారణం అతడు టీమిండియా బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ క్యాచ్‌ను మిస్ చేయడమే. ఆటలో భాగంగా గురువారం ఆతిథ్య జట్టు పేలవ ఫీల్డింగ్‌ను కనబర్చింది. దీంతో రెండో రోజు మొత్తం ఐదు క్యాచ్‌లను మిస్ చేశారు. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ ఓవర్‌లో రెండు క్యాచ్‌లను జారవిడచం విశేషం.
148వ ఓవర్‌లో రోహిత్ శర్మ
నాథన్ లియాన్ వేసిన ఇన్నింగ్స్ 148వ ఓవర్‌లో రోహిత్ శర్మ ఆడిన స్వీప్ షాట్‌కు బంతి షార్ట్ ఫైన్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తోన్న పీటర్ సిడ్డిల్ చేతిలో పడినప్పటికీ అతడు జారవిడిచాడు. పాట్ కమ్మిన్స్ స్థానంలో పీటర్ సిడ్డిల్ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా మైదానంలోకి వచ్చాడు. ఆ తర్వాత బంతికే రోహిత్ శర్మ ఇచ్చిన మరో క్యాచ్‌ని ట్రావిస్ హెడ్ జారవిడిచాడు.

ఒకే ఓవర్‌లో రోహిత్ శర్మకు రెండు లైఫ్‌లు
ఇలా ఒకే ఓవర్‌లో రోహిత్ శర్మకు రెండు లైఫ్‌లు వచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనకు వచ్చిన లైఫ్‌లను చక్కగా వినియోగించుకున్న రోహిత్ శర్మ (63 నాటౌట్: 114 బంతుల్లో 5 ఫోర్లు) హాఫ్ సెంచరీ సాధించాడు. టెస్టుల్లో రోహిత్ శర్మకు ఇది 10వ హాఫ్ సెంచరీ. మరోవైపు, రెండో రోజు ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్... భారత బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మను సిక్స్ కొట్టాలంటూ రెచ్చగొట్టిన ఘటన మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది.

రోహిత్ శర్మను టీజ్ చేసిన ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్
ఓపికగా ఆడుతూ పరుగులు సాధిస్తున్న రోహిత్ శర్మ ఏకాగ్రతను దెబ్బతీసేందుకు ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ వికెట్ల వెనకాల నుంచి తెగ ప్రయత్నించాడు. లియాన్ బౌలింగ్‌లో రోహిత్‌ను టీజ్ చేశాడు. రోహిత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కీపర్‌గా ఉన్న పైన్.. షార్ట్‌మిడ్‌లెగ్‌లో ఉన్న ఆసీస్ ప్లేయర్ ఆరోన్ ఫించ్‌తో మాట్లాడాడు. నాథన్ లియాన్ బౌలింగ్ చేస్తున్నప్పుడు ఆరోన్ ఫించ్‌తో మాట్లాడుతున్నట్లు పైన్ నటించాడు. అదే సమయంలో బ్యాటింగ్ క్రీజులో ఉన్న రోహిత్ శర్మను తన మాటలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు.
'సిక్స్ కొడితే నేను ముంబైకి మారిపోతా'
గతంలో రాజస్థాన్ రాయల్స్‌కు ఆడిన ఆరోన్ ఫించ్, రోహిత్ మధ్య పోటీ పెడుతూ "నా ఓటు రాయల్స్‌కా, ఇండియన్స్‌కా ఇప్పుడు తేలిపోతుంది. రోహిత్ ఇప్పుడు సిక్స్ కొడితే నేను ముంబైకి మారిపోతా" అంటూ పైన్ వ్యాఖ్యలు చేశాడు. టిమ్ పైన్ తన మాటలతో ఎంత రెచ్చగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ, రోహిత్ శర్మ మాత్రం ఎటువంటి సహనాన్ని కోల్పోలేదు. పైన్ ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత రెండు బంతులను రోహిత్ శర్మ డిఫెన్స్ ఆడాడు. హిత్‌ను టిమ్ పైన్ టీజ్ చేసిన మాటలు వికెట్ల దగ్గర మైక్‌లో స్పష్టంగా రికార్డయ్యాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications