'అనుష్క.. అనుష్క' అంటూ నినాదాలు: కోహ్లీ స్పందన ఇదీ (వీడియో)


హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ నిత్యం అభిమానులతో సోషల్ మీడియాతో ద్వారా టచ్‌లో ఉంటుంటారు. అభిమానుల కోరిక మేరకు ఒకరిపై మరొకరు తమ స్పందనను వెల్లడించిన సందర్భాలు అనేకం. గతంలో వీరికి సంబంధించిన వీడియోలను ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో అభిమానులతో పంచుకున్నారు.
తాజాగా విరాట్ కోహ్లీ సైతం అనుష్క శర్మ పట్ల తనదైన శైలిలో స్పందించాడు. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య నాలుగో వన్డే ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ మైదానంలో ఉండగా.. అభిమానులంతా "అనుష్క.. అనుష్క" అంటూ నినాదాలు చేశారు.
థమ్సప్ సింబల్ చూపించిన కోహ్లీ
అభిమానుల నినాదాలకు విరాట్ కోహ్లీ థమ్సప్ సింబల్ చూపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ఐదు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే నాలుగు వన్డేలు ముగియగా.. టీమిండియా 2-1తో ఆధిక్యంలో కొనసాగుతోంది.

తిరువనంతపురం వేదికగా ఐదో వన్డే
ఐదు వన్డేల సిరీస్‌లో తొలి వన్డేలో భారత్ విజయం సాధించగా, విశాఖలో జరిగిన రెండో వన్డే టైగా ముగిసింది. పుణెలో జరిగిన మూడో వన్డేలో విండీస్ విజయం సాధించగా, తాజా వన్డేను భారత్ కైవసం చేసుకుంది. ఇరు జట్ల మధ్య ఐదో వన్డే తిరువనంతపురం వేదికగా నవంబరు 1న జరగనుంది.
ఇరు జట్లకు అభిమానులు పెద్దఎత్తున స్వాగతం
విమానాశ్రయంలో ఇరు జట్ల ఆటగాళ్లకు అభిమానులు పెద్దఎత్తున స్వాగతం పలికారు. ఆ తర్వాత హోటల్‌కు చేరుకున్న ఆటగాళ్లకు కేరళ సంప్రదాయక వాయిద్యాలతో కొంతమంది కళాకారులు చేసిన ప్రదర్శన అందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐ తన ట్విట్టర్‌లో పోస్టు చేసింది.
అభిమానులకు ప్రత్యేక ధనవాద్యాలు తెలిపిన బీసీసీఐ
ఇంతటి ఘనస్వాగతం పలికిన అభిమానులకు ప్రత్యేక ధనవాద్యాలంటూ బీసీసీఐ ట్వీట్ చేసింది. మరోవైపు వెస్టిండీస్ క్రికెట్ జట్టు కూడా తమ అధికారిక ట్విటర్ ఖాతాలో ఓ వీడియోను పంచుకుంది. కేరళను చూస్తుంటే మా దేశం గుర్తుకు వస్తుందంటూ వీడియో కింద రాసుకొచ్చింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications