Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సోషల్ మీడియాలో వైరల్: ఇదేం బౌలింగ్ యాక్షన్ రా నాయనా! (వీడియో)

Pavel Florin's Hilarous Bowling Action Will Leave You In Splits || Oneindia Telugu
 Watch: Pavel Florins hilarous bowling action will leave you in splits

హైదరాబాద్: యూరోపియన్ టీ10 క్రికెట్ లీగ్‌లో ఓ బౌలర్ తన విచిత్రపు బౌలింగ్‌‌తో క్రికెట్ అభిమానులను కడుపుబ్బా నవ్వించాడు. రొమేనియాకు చెందిన పావెల్ ఫ్లోరిన్ అనే క్రికెటర్ తన విచిత్రపు బౌలింగ్ యాక్షన్‌తో అలరించాడు. వివరాల్లోకి వెళితే... టోర్నీలో భాగంగా డ్రూక్స్ క్రికెట్ క్లబ్-క్లజ్ క్రికెట్ క్లబ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.

ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి

ఈ మ్యాచ్‌లో క్లజ్ క్రికెట్ క్లబ్ జట్టుకు చెందిన పావెల్ ఫ్లోరిన్ తన ఒంటి చేయి బౌలింగ్ యాక్షన్‌తో అభిమానులను అలరించాడు. కుడి చేత్తో బంతిని పట్టుకుని నిదానంగా క్రీజులోకి పరిగెత్తుకుంటూ వచ్చి పావెల్ ఫ్లోరిన్ నెమ్మదిగా బంతిని విసరడాన్ని మనం చూడొచ్చు. క్రీజులో ఉన్న బ్యాట్స్‌మన్ సైతం బంతి కోసం వేచి చూడాల్సిన పరిస్థితి.

అయితే, ఈ స్లో బౌలింగ్‌లో బ్యాట్స్‌మన్ పరుగులు రాబట్టలేక పోవడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో ఈ వీడియోని వీక్షించిన ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం మార్క్ వా తన ట్విట్టర్‌లో "అలాంటి బంతిని బాదడం చాలా కష్టం" అంటూ ట్వీట్ చేశాడు.

మరొక అభిమాని అయితే, ఈ బౌలింగ్ యాక్షన్‌ను టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ యాక్షన్‌తో పోల్చాడు. ప్రస్తుతం జరుగుతున్న తమిళనాడు ప్రీమియర్ లీగ్(టీఎన్‌పీఎల్)లో అశ్విన్ సైతం ఇదే తరహా బౌలింగ్‌ను వేసిన సంగతి తెలిసిందే. పుల్ యాక్షన్‌తో కాకుండా బంతిని విసిరి వికెట్లు కూడా పడగొట్టాడు.

కాగా, యూరోపియన్ టీ10 లీగ్ టోర్నమెంట్‌‌లో మొత్తం 8 జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి టైటిల్ కోసం తలపడుతున్నాయి. జులై 29 నుంచి 31 వరకు నాలుగు రోజుల పాటు ఈ టోర్నీ జరగనుంది. ఈ మ్యాచ్‌లకు స్పెయిన్‌లోని లా మంగా క్రికెట్ క్లబ్ ఆతిథ్యమిస్తోంది.

Story first published: Tuesday, July 30, 2019, 17:58 [IST]
Other articles published on Jul 30, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+