గవర్నమెంట్ స్కూల్‌లో కమిన్స్.. ఎంత పొగిడినా తక్కువే! (Video)
డేవిడ్ వార్నర్ తర్వాత తెలుగు క్రికెట్ అభిమానుల ప్రేమను ఎక్కువగా పొందిన ఆస్ట్రేలియన్ క్రికెటర్‌గా ప్యాట్ కమిన్స్ రోజురోజుకు ప్రసిద్ధి చెందుతున్నాడు. ఎయిడెన్ మార్క్‌రమ్ స్థానంలో ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పగ్గాలు అందుకున్న కమిన్స్ నాయకుడిగా అదరగొడుతున్నాడు. హైదరాబాద్ జట్టుకు దూకుడు అలవాటు చేయడమే కాకుండా, భారీ స్కోర్లు నమోదు చేయిస్తూ ప్రపంచ టీ20 క్రికెట్‌లో సరికొత్త పంథా తీసుకువచ్చాడు.
గత సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. కానీ ఈ సీజన్‌లో మరో మ్యాచ్ మిగిలుండగానే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. పంజాబ్ కింగ్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో గెలిస్తే ఏకంగా టాప్-2లో చోటు దక్కించుకుంటుంది. అలా జరగాలంటే కేకేఆర్-రాజస్థాన్ ఫలితంపై కూడా ఆధారపడాల్సి ఉంది. ఆ పోరులో రాజస్థాన్ రాయల్స్ ఓటమిపాలవ్వాలి.

అయితే సన్‌రైజర్స్ సాధించిన విజయాల్లో కెప్టెన్ కమిన్స్ పాత్ర చాలా కీలకం. సందర్భాన్ని బట్టి మిడిల్ ఓవర్లు, డెత్ ఓవర్లు బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. అంతేగాక బ్యాటుతోనూ సత్తాచాటుతున్నాడు. తెలుగు జట్టును విజయపథంలో నడిపిస్తూ తెలుగు రాష్ట్రాల్లో అభిమానాన్ని సంపాదించుకున్నాడు. అయితే ఆటతోనే కాకుండా తన వ్యక్తిత్వంతో అభిమానుల గుండెల్లో తన స్థానాన్ని కమిన్స్ సుస్థిరం చేసుకున్నాడు.
తాజాగా కమిన్స్ హైదరాబాద్‌లోని సరూర్ నగర్ పరిథిలో కర్మన్‌ఘాట్ ప్రభుత్వ పాఠశాలను సందర్శించడానికి వెళ్లాడు. అక్కడి విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించాడు. పాఠశాల ఆవరణలో పిల్లలతో కలిసి క్రికెట్ ఆడాడు. ఆల్‌రౌండర్ అయిన కమిన్స్ స్కూల్‌లో వికెట్ కీపింగ్ కూడా చేయడం విశేషం. విద్యార్థులు బ్యాటింగ్ చేస్తుంటే వికెట్ల వెనుక నిలబడి గ్లవ్స్ బాధ్యతలు అందుకున్నాడు. అంతేగాక, బ్యాటింగ్ చేసి స్టూడెంట్స్‌ను అలరించాడు.
దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పిల్లలతో కలిసి సమయాన్ని గడిపిన కమిన్స్‌ను నెటిజన్లు కొనియాడుతున్నారు. కమిన్స్‌ను ఎంత పొగిడినా తక్కువే అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, గత ఏడాది కమిన్స్ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచింది. వన్డే వరల్ట్ కప్, వరల్ట్ టెస్టు ఛాంపియన్‌షిప్‌తో పాటు యాషెస్ సిరీస్‌ను కమిన్స్ సాధించాడు. అదే జోరు కొనసాగిస్తూ ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌కు టైటిల్ అందిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications