క్యాచ్ పట్టినట్టు నటించి నవ్వులు పాలైన పాక్ క్రికెటర్ (వీడియో)

హైదరాబాద్: పాకిస్థాన్ క్రికెటర్ అహ్మద్ షెహజాద్‌పై సోషల్ మీడియాలో జోకులు పేల్చుతున్నారు. లాహోర్ వేదికగా "పాకిస్థాన్ కప్"లో భాగంగా జరిగిన ఓ మ్యాచ్‌లో కిందపడిన బంతిని తిరిగి చేతిలోకి తీసుకుని క్యాప్ పట్టుకున్నట్లు నటించమే ఇందుకు కారణం. ఏప్రిల్ 2న ప్రారంభమైన ఈ టోర్నీలో మొత్తం ఐదు జట్లు పాల్గొంటున్నాయి.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
క్యాచ్ అందుకున్నట్టు నటించిన అహ్మద్ షెహజాద్
ఈ టోర్నీలో ఫెడరల్ ఏరియాస్, ఖైబర్ పఖ్తుంఖ్వా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఫెడరల్ ఏరియాస్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోన్న షెజాద్ డీప్ మిడ్ వికెట్‌లో ఫీల్డింగ్ చేస్తూ క్యాచ్ జారవిడిచాడు. ఆ తర్వాత తనకు ఏమీ తెలియదన్నట్లు రివ్యూని కోరాడు. అంతేకాదు కిందపడిన బంతిని తిరిగి చేతిలోకి తీసుకుని క్యాచ్ అందుకున్నట్టు నటించాడు.

రివ్యూలో స్పష్టంగా కనబడటంతో
కిందపడిన బంతిని చేతుల్లోకి తీసుకున్నట్టు రివ్యూలో స్పష్టంగా కనబడటంతో అంఫైర్లు నాటౌట్‌గా ప్రకటింఛారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్‌లో మరో రెండు బంతులు మిగిలుండగానే ఖైబర్ పఖ్తుంఖ్వా జట్టు 3 వికెట్లు తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో 60 పరుగులు చేసిన షెహజాద్
ఈ మ్యాచ్‌లో ఖైబర్ పఖ్తుంఖ్వా బౌలర్ వాహబ్ రియాజ్(5/53) అద్భుత ప్రదర్శనకు గాను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మరోవైపు ఫెడరల్ ఏరియాస్ జట్టు తరుపున అహ్మద్ షెహజాద్ 56 బంతుల్లో 60 పరుగులు చేశాడు. దీంతో ఆ జట్టు తరుపున అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications