సెప్టెంబర్ 9: సచిన్ టెండూల్కర్ జీవితంలో ఎంతో ప్రత్యేకం
హైదరాబాద్: సెప్టెంబర్ 9... సచిన్ టెండూల్కర్ జీవితంలో ఎంతో ప్రత్యేకం. అంతర్జాతీయ క్రికెట్‌లో తన పేరిట ఎన్నో రికార్డులను సృష్టించిన సచిన్ తన కెరీర్‌లో తొలి వన్డే సెంచరీని ఈరోజే నమోదు చేశాడు. 1994, సెప్టెంబర్ 9వ తేదీన ప్రేమదాస స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సచిన్ తొలి వన్డే సెంచరీని సాధించాడు.
సచిన్ తన కెరీర్‌లో వన్డేల్లో మొత్తం 49 సెంచరీలు సాధించిన సంగతి తెలిసిందే. 130 బంతుల్లో 110 పరుగులతో సచిన్ తన తొలి వన్డే సెంచరీని నమోదు చేశాడు. 1989లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సచిన్.. వన్డేల్లో సెంచరీ చేయడానికి ఐదేళ్లు సమయం పట్టింది.

అంతేకాదు తన తొలి సెంచరీ చేయడానికి సచిన్‌కు 78 వన్డే మ్యాచ్‌లు అవసరమయ్యాయి. అయితే అదే సమయానికి సచిన్ 17 హాఫ్ సెంచరీలు సాధించడం విశేషం. అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఒక్కడే. వన్డేల్లో 49 సెంచరీ సాధించిన సచిన్.. టెస్టుల్లో 51 సెంచరీలు చేశాడు.
1989 నుంచి 1993 మధ్య మొత్తం 77 వన్డే మ్యాచులు ఆడిన సచిన్ ఒక్క సెంచరీ చేయనప్పటికీ, ఆ తర్వాతి ఏడాది నుంచి సెంచరీల మీద సెంచరీలు చేశాడు. 1994లో న్యూజిలాండ్‌తో భారత్‌కు జరిగిన మ్యాచ్‌లో మొదటి సారి ఓపెనర్‌గా దిగిన సచిన్ 49 బంతుల్లో 82 పరుగులు చేశాడు కానీ, సెంచరీ చేయలేకపోయాడు.
ఆ తర్వాత అదే ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో 130 బంతుల్లో 110 పరుగులు చేశాడు. సచిన్ ఆ ఏడాది సెప్టెంబర్ 9న తన మొదటి సెంచరీ చేసిన సందర్భంగా ఈ రోజు ఐసీసీ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది. అంతేకాదు సచిన్ తన 78వ వన్డే మ్యాచ్‌లో తొలి సెంచరీ చేశాడని పేర్కొంది.
ఆ మ్యాచ్‌లో సచిన్ రెండు సిక్సులు, ఎనిమిది ఫోర్లు బాదాడు. సచిన్ కూడా తన ట్విట్టర్ ఖాతాలో ఆ నాటి తీపి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ సమయం వెళ్లిపోతున్నా ఆ తీపి జ్ఞాపకాలు అలా ఎప్పటికీ గుర్తుండి పోతాయని హర్షం వ్యక్తం చేశాడు. ఈ తీపిగుర్తును పోస్ట్ చేసినందుకు గానూ ఐసీసీకి ట్విట్టర్‌లో ధన్యవాదాలు తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications