బాక్సింగ్ డే టెస్ట్: వికెట్ కీపింగ్‌లో ధోనిని మరపిస్తోన్న పంత్

హైదరాబాద్: మెల్‌బోర్న్ వేదికగా ఆతిధ్య ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మైదానంలో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని మరపిస్తున్నాడు. వికెట్ల వెనుక కీపింగ్ చేస్తున్న రిషబ్ పంత్ అప్పుడప్పుడూ ఫీల్డింగ్‌ను కూడా సెట్ చేస్తున్నాడు.
అంతేకాదు ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మన్ ఏకాగ్రతను సైతం దెబ్బతీసేలా స్లెడ్జింగ్ కూడా చేస్తున్నాడు. తాజాగా, మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో టిమ్ పైన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రవీంద్ర జడేజా బౌలింగ్‌కు వచ్చాడు.

చొరవ తీసుకొని ఫీల్డింగ్‌ను సెట్ చేసిన పంత్
జడేజా బౌలింగ్‌లో టిమ్ పైన్ డిఫెన్స్ ఆడుతుండటంతో రిషబ్ పంత్ చొరవ తీసుకొని ఫీల్డింగ్‌ను మార్చాడు. ఈ సమయంలో విరాట్ కోహ్లీ సైతం పంత్ మార్పులకే మొగ్గు చూపాడు. ఈ సంఘటన ఇన్నింగ్స్ 46వ ఓవర్‌లో చోటు చేసుకుంది. ఈ సమయంలో ఆస్ట్రేలియా 6 వికెట్లు కోల్పోయి 105 పరుగులతో ఉంది.

ధోని తరహాలోనే సహచరులను ఉత్తేజపరుస్తూ
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మాజీ కెప్టెన్ ధోని తరహాలోనే సహచరులను ఉత్తేజపరుస్తూ.. బౌలింగ్‌లో మార్పులు చెబుతున్నాడని నెటిజన్లు రిషబ్ పంత్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా, ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 151 పరుగులకే ఆలౌటైంది.
మళ్లీ స్లెడ్జింగ్‌కి దిగిన టిమ్ పైన్
అనంతరం టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ మళ్లీ స్లెడ్జింగ్‌కి దిగాడు. శుక్రవారం ధోనీ పేరుని ప్రస్తావిస్తూ రిషబ్ పంత్‌ని కవ్వించాడు. "ధోనీ మళ్లీ వికెట్ కీపర్‌గా భారత వన్డే, టీ20 జట్టులోకి వచ్చేశాడు. కాబట్టి, నిన్ను బిగ్‌బాష్ టోర్నీలోని హాబర్ట్ హారికేన్స్ టీమ్‌లోకి తీసుకుంటా. ఈ డీల్ ఓకే అయితే బాగుంటుంది కదా? నువ్వు కూడా ఆస్ట్రేలియా హాలిడేస్‌ని మరింతగా ఎంజాయ్ చేసే అవకాశం దొరుకుతుంది. ఓ మంచి అపార్ట్‌మెంట్ తీసుకుందాం. ఒకవేళ నువ్వు అమ్మాయితో గడపాలనుకుంటే.. నేను నా భార్యని తీసుకుని సినిమాకి వెళ్తా. నువ్వు రాత్రంతా అమ్మాయితో ఎంజాయ్ చేయొచ్చు" పంత్ ఏకాగ్రతని దెబ్బతీసే ప్రయత్నం చేశాడు.

రోహిత్ శర్మ ఏకాగ్రతని దెబ్బతీసిన టిమ్ పైన్
అంతకముందు ఆటలో భాగంగా గురువారం ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్... రోహిత్ శర్మ ఏకాగ్రతని దెబ్బతీసేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. చాలా ఓపికగా ఆడుతూ పరుగులు సాధిస్తున్న రోహిత్ శర్మ ఏకాగ్రతను దెబ్బతీసేందుకు ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ వికెట్ల వెనకాల నుంచి తెగ ప్రయత్నించాడు. లియాన్ బౌలింగ్‌లో రోహిత్‌ను టీజ్ చేసిన సంగతి తెలిసిందే. రోహిత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కీపర్‌గా ఉన్న పైన్ "ఇప్పుడు రోహిత్ శర్మ సిక్స్ కొడితే నేను ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కి మారిపోతా" అని టిమ్ పైన్ కవ్వించడం స్టంప్ మైక్‌లో రికార్డు అయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications