నైల్ కళ్లు చెదిరే క్యాచ్‌కి రోహిత్ శర్మ అవుట్ (వీడియో)
హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా బౌలర్ కౌల్టర్ నైల్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో 10 ఓవర్లు వేసిన నైల్ 51 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఐదు వన్డేల్ సిరిస్‌లో భాగంగా చెన్నైలో జరిగిన తొలి వన్డేలో 3 వికెట్లు తీసిన నైల్ రెండో వన్డేలో కూడా 3 వికెట్లు ఔరా అనిపించాడు.
అయితే భారత జట్టు స్కోరు 19 పరుగులు ఉన్నప్పుడు భారత ఓపెనర్ రోహిత్ శర్మను అవుట్ చేసిన తీరు అమోఘం. ఈ మ్యాచ్‌లో నైల్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ (7) పరుగుల వద్ద కాట్ అండ్ బౌల్డ్ అయ్యాడు. రోహిత్ కొట్టిన బలమైన షాట్‌ను నైల్ అద్భుతంగా క్యాచ్ పట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
నిరాశ పరిచిన రోహిత్ శర్మ
ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 252 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో ఆసీస్‌కు 253 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్ రోహిత్ శర్మ (7) మరోసారి నిరాశ పరిచాడు. నైల్ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

రెండో వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యం
అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లీ (92), రహానె (55)తో కలిసి చక్కటి భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 102 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. దూకుడుగా ఆడుతున్న క్రమంలో రహానే రనౌట్ అయ్యాడు.

నిలకడగా ఆడిన కోహ్లీ
అనంతరం క్రీజులోకి వచ్చిన పాండే(3) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. జాదవ్ 24 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నైల్ బౌలింగ్‌లో మాక్స్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా కెప్టెన్ కోహ్లీ మాత్రం నిలకడగా ఆడుతూ వచ్చాడు. ఈ క్రమంలో సెంచరీకి చేరువైన కోహ్లీని నైల్ బౌల్డ్ చేశాడు.

5 పరుగులకే అవుటైన ధోని
ఆ తర్వాత ధోని (5) కూడా అవుటయ్యాడు. ధోని అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన వారు పెద్దగా రాణించలేదు. ఇదే సమయంలో 47.3 ఓవర్ వద్ద వర్షం కారణంగా మ్యాచ్ కాసేపు నిలిచిపోయింది. వర్షం కాస్త తెరిపినినవ్వడంతో తిరిగి ఆట ప్రారంభమైన వెంటనే టీమిండియా వెనువెంటనే మిగతా వికెట్లను కోల్పోయింది.

కుల్దీప్ యాదవ్ డకౌట్
ఆట తిరిగి ప్రారంభం కాగానే అప్పటికి క్రీజులో ఉన్న హార్దిక్ పాండ్యా (20), భువనేశ్వర్ కుమార్ (20) వికెట్లను కోల్పోయింది. భువీ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కుల్దీప్ యాదవ్ వచ్చీ రాగానే కమిన్స్ వేసిన బంతిని వేడ్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన యుజువేంద్ర (1)ను వేడ్ రనౌట్ చేశాడు. జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే 10 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో కౌల్టర్ నైల్, రిచర్డ్‌సన్ చెరో మూడు వికెట్లు తీసుకోగా... కమ్మిన్స్, అగర్ చెరో వికెట్ తీశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications