సిడ్నీ వన్డేలో అంఫైర్ తప్పుడు నిర్ణయానికి బలైన ధోని (వీడియో)

హైదరాబాద్: సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి వన్డేలో రోహిత్‌తో ఆచితూచి ఆడుతూ 93 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ధోని.. ఎల్బీగా వెనుదిరగడం భారత విజయ అవకాశాలపై ప్రభావం చూపిందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. తొలి వన్డేలో 4 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన ధోని రోహిత్ శర్మతో కలిసి నెమ్మదిగా ఆడాడు.
93 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ధోనీ తన కెరీర్‌లో 68వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ధోని తన కెరీర్లో అత్యంత నెమ్మదిగా చేసిన రెండో హాఫ్ సెంచరీ ఇదే కావడం గమనార్హం. అంతేకాదు ఈ ఏడాది తాను ఆడిన తొలి వన్డేలోనే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఫలితంగా 14 ఇన్నింగ్స్‌ల విరామం తర్వాత ధోని చేసిన హాఫ్ సెంచరీ ఇది.

నాలుగో వికెట్‌కు 137 పరుగులు
ఈ మ్యాచ్ ధోని... రోహిత్ శర్మతో కలిసి నాలుగో వికెట్‌కు 137 పరుగులు జోడించాడు. పది పరుగులలోపు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను వీరిద్దరి జోడీ ఆదుకుంది. అంతేకాదు నాలుగో వికెట్‌కు నమోదైన రెండో అతిపెద్ద భాగస్వామ్యం ఇదే కావడం గమనార్హం. 1984లో ఆస్ట్రేలియా విండీస్‌పై 150 పరుగులు చేయడమే ఇప్పటి వరకూ అత్యుత్తమం.

ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగిన ధోని
వీరిద్దరి జోడీ నిలకడగా ఆడుతున్న తరుణంలో బెహ్రెన్‌డ్రాఫ్ బౌలింగ్‌లో ధోనీ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. బంతి అవుట్ సైడ్ పిచ్ అయినా.. అదేమీ పట్టించుకోకుండానే ఫీల్డ్ అంపైర్ మైకెల్ గవుఫ్ ధోనిని ఔటిచ్చాడు. టీమిండియా అప్పటికే ఉన్న ఒక్క రివ్యూను వృథా చేయడంతో.. మరోసారి డీఆర్ఎస్ కోరే అవకాశం లేకపోయింది. దీంతో భారత్ కీలకమైన ధోనీ వికెట్ కోల్పోయింది.
నిరాశగా పెవిలియన్‌కు చేరిన ధోని
డీఆర్ఎస్ కోరడంలో దిట్ట అయిన ధోని నిరాశగా పెవిలియన్ చేరాడు. అంతకముందు రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిన అంబటి రాయుడు సమీక్షకు వెళ్లి వృథా చేశాడు. ఇదే భారత విజయవకాశాలను దెబ్బతీసింది. ఈ విషయాన్ని మ్యాచ్ అనంతరం ఆసీస్ బౌలర్ రిచర్డ్‌సన్ సైతం ప్రస్తావించాడు. ధోని వికెటే మ్యాచ్‌ని మలుపు తిప్పిందని చెప్పుకొచ్చాడు. శనివారంలో సిడ్నీవేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 34 పరుగుల తేడాతో ఓడిపోయింది.

సెంచరీతో రాణించిన రోహిత్ శర్మ
మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 2-1తో సొంతం చేసుకుని చరిత్ర సృష్టించిన టీమిండియా వన్డేల్లోనూ సులువుగా విజయం సాధిస్తుందని అంతా భావించారు. కానీ, అనూహ్యంగా ఆసీస్ బౌలర్ రిచర్డ్‌సన్ (4/26) దాటికి భారత్ బ్యాట్స్‌మెన్ వికెట్లను సమర్పించుకున్నారు. ఓపెనర్‌గా రోహిత్ శర్మ (133) ఒక్కడే సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications