న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కుల్దీప్‌కు హిందీలో సూచన: బౌల్ట్‌ను బోల్తా కొట్టించిన ధోని (వీడియో)

Ind vs NZ,1st ODI : MS Dhoni The Genius! How MSD Plotted Trent Boult's Dismissal With Kuldeep Yadav
Watch: MS Dhoni the genius! How MSD plotted Trent Boults dismissal with Kuldeep Yadav

హైదరాబాద్: మహేంద్ర సింగ్ ధోని... ప్రపంచ క్రికెట్‌కు పరిచయం అక్కర్లేని పేరు. వికెట్ కీపర్‌గా బ్యాట్స్‌మన్‌గా అనేక చిరస్మరణీయ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ముఖ్యంగా వికెట్ల వెనుక నుంచి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ ఆలోచనల్ని వేగంగా చదవడంలో ధోనీది అందివేసిన చేయి.

<strong>నేపియర్: సూర్యూడు అడ్డుపడటంతో నిలిచిన భారత్-న్యూజిలాండ్ మ్యాచ్</strong>నేపియర్: సూర్యూడు అడ్డుపడటంతో నిలిచిన భారత్-న్యూజిలాండ్ మ్యాచ్

తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో ఇప్పటికే ఎన్నోసార్లు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ని ఔట్ చేయడంలో భారత్ బౌలర్లకి ధోని సాయపడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా స్పిన్నర్లకు ధోని కీలక సూచనలు చేస్తుంటాడు. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా నేపియర్ వేదికగా భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డేలో ధోని తన వ్యూహంతో మరోసారి తిరుగులేదని నిరూపించుకున్నాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ జట్టు 37.5 ఓవర్లు ముగిసే సమయానికి 157/9తో నిలిచింది. ఈ దశలో ఆఖరి వికెట్ కోసం కుల్దీప్ యాదవ్‌తో కలిసి ధోని వ్యూహం రచించి సక్సెస్ అయ్యాడు. ధోని వ్యూహం కారణంగానే ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 38 ఓవర్లలోపే ఆలౌటైంది.

కుల్దీప్‌కు హిందీలో సూచనలు

కుల్దీప్‌కు హిందీలో సూచనలు

క్రీజులో ఉన్న న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ ట్రెంట్ బౌల్ట్ (1: 10 బంతుల్లో) బంతిని డిఫెన్స్ చేసేందుకు ప్రయత్నిస్తుండటాన్ని ధోని పసిగట్టాడు. దీంతో కుల్దీప్ యాదవ్‌కి వికెట్ల వెనుక నుంచి హిందీలో సూచనలు చేశాడు. బంతిని వికెట్లకి వెలుపలగా విసరాలని సూచిస్తూనే.. ఏమాత్రం లోపలికి వేయద్దని హెచ్చరించాడు.

స్లిప్‌లో రోహిత్ శర్మ

స్లిప్‌లో రోహిత్ శర్మ

అదే సమయంలో స్లిప్‌లో రోహిత్ శర్మని మొహరించాడు. ధోని చెప్పిన విధంగానే కుల్దీప్ యాదవ్ బంతిని వేయగా... ఆ బంతిని ప్లిక్ చేసేందుకు బౌల్ట్ ప్రయత్నించగా గాల్లోకి లేచిన బంతిని రోహిత్ శర్మ అమాంతం క్యాచ్‌గా అందుకున్నాడు. దీంతో న్యూజిలాండ్ 157 పరుగులకే ఆలౌటైంది.

సోషల్ మీడియాలో వైరల్

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. గతేడాది సెప్టెంబరులో జరిగిన ఆసియా కప్‌లో ధోని సూచనల్ని పెడచెవిన పెట్టిన కుల్దీప్ యాదవ్‌ని ‘బౌలింగ్ మారుస్తావా? లేక బౌలర్‌ని మార్చమంటావా?' అంటూ ధోని హెచ్చరించిన సంగతి తెలిసిందే.

Story first published: Wednesday, January 23, 2019, 13:29 [IST]
Other articles published on Jan 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X