హైదరాబాద్: మహేంద్ర సింగ్ ధోని భారత్‌కు రెండు వరల్డ్ కప్‌లు అందించిన ఏకైక కెప్టెన్. ముఖ్యంగా 2011 వరల్డ్ కప్ ఫైనల్లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో సిక్స్‌తో మ్యాచ్‌ని ముగించిన తీరు ఇప్పటికీ అభిమానుల్లో చెక్కచెదరదు. తాజాగా ధోని బాదిన ఓ షాట్ 2011 వరల్డ్ కప్ ఫైనల్లో మ్యాచ్ ఫినిషింగ్ షాట్‌ను గుర్తు చేసిందిన బీసీసీఐ తన ట్విట్టర్‌లో పోస్టు చేసింది.
మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి మ్యాచ్‌ను ముగించడంలో మహేంద్ర సింగ్ ధోని దిట్ట. తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో భారత్‌కు ఎన్నో విజయాలు అందించాడు. వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో ధోని సిక్సుతో భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే.
తాజాగా, న్యూజిలాండ్‌తో ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరిస్‌లో తొలి వన్డేకు వాంఖడె స్టేడియం ఆతిథ్యమిస్తోంది. ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ ఆదివారం జరగనుంది. ఇందులో భాగంగా ఇరు జట్లు శుక్రవారం వాంఖడె నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీస్ చేశాయి. ప్రాక్టీస్ సెషన్‌లో భారత బ్యాట్స్‌మన్‌కు అర్జున్ బౌలింగ్ చేశాడు.
తొలుత ఓపెనర్ శిఖర్ ధావన్‌కు బంతులు వేసిన అర్జున్ ఆ తర్వాత కోహ్లీ, రహానే కేదార్ జాదవ్‌లకు బౌలింగ్ చేశాడు. ప్రాక్టీస్ సెషన్‌లో ధోని కొట్టిన ఓ షాట్ వీడియోను 'ధోని వాంఖడెలో నీవు కొట్టిన బిగ్ షాట్.. మధుర క్షణమైన 2011 సిక్సును గుర్తుచేస్తోంది' అనే క్యాఫ్షన్‌తో బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.