న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోని ఎంత లక్కీనో: బంతి స్టంప్స్‌కు తగిలినా.. బెయిల్స్ పడలేదు (వీడియో)

IPL 2019 : MS Dhoni Survives Even After Ball Hits The Stumps || Oneindia Telugu
Watch: MS Dhoni Survives Even After Ball Hits Stumps

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌లో భాగంగా ఆదివారం రాత్రి రాజస్థాన్ రాయల్స్-చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని డకౌటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

28 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి చెన్నై

28 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి చెన్నై

28 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి చెన్నై కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన ధోని వెంటనే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో ఈ ఘటన జరిగింది. జోఫ్రా ఆర్చర్ వేసిన బంతి స్టంప్స్‌ను తగిలినా.. బెయిల్స్ మాత్రం కింద పడలేదు. దీంతో బతికిపోయిన ధోనీ.. తర్వాత కుదురుకొని మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు.

బంతి తగిలినా బెయిల్స్ కింద పడలేదు

ఆ సమయంలో వికెట్ల వెనుకే ఉన్న స్టీవ్ స్మిత్ ఎక్స్‌ప్రెషన్ చూసి అభిమానులు సైతం అవాక్కవుతున్నారు. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి కారణం ధోని ఇన్నింగ్సే. కఠినమైన చెపాక్ పిచ్‌పై కేవలం 46 బంతుల్లోనే 75 పరుగులు చేశాడు. తలా ధోనీ ఎఫెక్ట్ చూశారా.. బంతి తగిలినా బెయిల్స్ కింద పడలేదు అంటూ ఐపీఎల్ ఈ వీడియోను పోస్ట్ చేసింది.

8 పరుగుల తేడాతో చెన్నై విజయం

రాజస్థాన్ రాయల్స్‌తో ఆదివారం రాత్రి చెపాక్ వేదికగా జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తాచాటిన చెన్నై 8 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఛేదనలో రాజస్థాన్‌ టాపార్డర్‌ పూర్తిగా విఫలమైంది.

ధోని హాఫ్ సెంచరీ... 175 పరుగులు చేసిన చెన్నై

రాహుల్‌ త్రిపాఠి(39), స్మిత్‌(28), బెన్‌ స్టోక్స్‌(46)లు పోరాడినప్పటికి జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. సీఎస్‌కే బౌలర్లలో దీపక్‌ చహర్‌, ఇమ్రాన్‌ తాహీర్‌, డ్వేన్‌ బ్రేవో, శార్దూల్‌లు తలో రెండు వికెట్లు తీశారు. అంతకముందు ధోని (75 నాటౌట్, 46 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులు) హాఫ్ సెంచరీతో రాణించడంతో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.

Story first published: Monday, April 1, 2019, 15:32 [IST]
Other articles published on Apr 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X