For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

5th ODI: ధోని త్రోని ఊహించలేకపోయాడు.. నీషమ్ రనౌట్ అయ్యాడిలా! (వీడియో)

WATCH: MS Dhoni pulls off a ridiculous run-out to leave James Neesham stunned in India vs New Zealand 5th ODI

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వికెట్ల వెనుక ఎంత అప్రమత్తంగా ఉండాడో అనే దానికి భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఐదో వన్డే మరోసారి గుర్తు చేసింది. ఈ మ్యాచ్‌లో 253 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు 36.1 ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది.

ఈ దశలో క్రీజులోని బ్యాట్స్‌మెన్ జేమ్స్ నీషమ్ (44: 32 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులు) వరుస బౌండరీలతో దూకుడుగా ఆడుతున్నాడు. దీంతో కేదార్ జాదవ్‌‌ని బౌలింగ్‌కి పిలిపించిన ధోని, తెలివిగా నీషమ్‌ని ఔట్ చేసి మళ్లీ రేసులోకి మళ్లీ భారత్‌ను తీసుకొచ్చాడు. ఇన్నింగ్స్ 37వ ఓవర్ వేసిన కేదార్ జాదవ్ బౌలింగ్‌లో బంతిని స్వీప్ చేసేందుకు నీషమ్ ప్రయత్నించాడు.

1
44084
ధోని పక్క నుంచి వికెట్లకి దూరంగా

ధోని పక్క నుంచి వికెట్లకి దూరంగా

అయితే, అతడి శరీరాన్ని తాకిన బంతి ధోని పక్క నుంచి వికెట్లకి దూరంగా వెళ్లింది. బంతి ఎక్కడికి వెళ్లిందోనని తెలుసుకునేందుకు కొన్ని క్షణాల సమయం తీసుకున్నాడు. అదే సమయంలో వికెట్ల వెనుకన ఉన్న బంతిని చూసి పరుగు కోసం సాహసోపేతంగా క్రీజు వెలుపలికి వెళ్లాడు. అయితే.. అప్పటికే బంతిని అందుకున్న ధోని రెప్పపాటులో దానిని వికెట్లపైకి విసిరాడు.

ధోని త్రోని ఊహించలేకపోయిన నీషమ్

ధోని త్రోని ఊహించలేకపోయిన నీషమ్ పేలవంగా రనౌటై నిరాశగా పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో వన్డేలో భారత్ విజయం సాధించింది. దీంతో వన్డే సిరీస్‌ను టీమిండియా ఘనంగా ముగించింది. సమష్టిగా రాణించిన భారత్ జట్టు 35 పరుగుల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది.

ఐదు వన్డేల సిరీస్‌ని 4-1తో టీమిండియా కైవసం

ఐదు వన్డేల సిరీస్‌ని 4-1తో టీమిండియా కైవసం

దీంతో ఐదు వన్డేల సిరీస్‌ని 4-1తో టీమిండియా కైవసం చేసుకుంది. 253 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు 44.1 ఓవర్లలోనే 217 పరుగులకి కుప్పకూలిపోయింది. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్లలో జేమ్స్‌ నీషమ్‌ (44), విలియమ్సన్‌ (39) ఫర్వాలేదనిపించారు.

బుధవారం నుంచి కివీస్‌తో మూడు టీ20ల సిరీస్‌

బుధవారం నుంచి కివీస్‌తో మూడు టీ20ల సిరీస్‌

భారత బౌలర్లలో చాహల్ (3/41), మహ్మద్ షమీ (2/35), హార్దిక్ పాండ్య (2/50) అద్భుత ప్రదర్శన చేశారు. అంతకముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 49.5 ఓవర్లకు 252 పరుగులు చేసింది. భారత క్రికెట్ జట్టు... బుధవారం నుంచి కివీస్‌తో మూడు టీ20ల సిరీస్‌లో తలపడనుంది.

Story first published: Sunday, February 3, 2019, 16:07 [IST]
Other articles published on Feb 3, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+