Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనితో ఓ బామ్మ: సోషల్ మీడియాలో వీడియో వైరల్

Watch: MS Dhoni makes the day of 87-year-old fan in Australia

హైదరాబాద్: మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. ధోనికి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అభిమానులు ధోని వద్దకు వచ్చినప్పుడు వారిని నిరాశపరచకుండా వారితో సెల్ఫీలు దిగుతూ ఉంటాడు. అదే ధోని ప్రత్యేకత. గురువారం అలాంటి సంఘటనే చోటు చేసుకుంది.

ప్రస్తుతం ధోని ఆస్ట్రేలియా పర్యటనలో ఉనన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ కోసం ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో 87 ఏళ్ల బామ్మ ధోని చూసేందుకు వచ్చింది. నెట్ ప్రాక్టీస్‌ అయిన తర్వాత ధోని కాసేపు ఆమెతో ఆప్యాయంగా మాట్లాడుతూ కొంత సమయం గడిపాడు. అనంతరం ఆమెతో కలిసి ఫోటోలు దిగాడు.

ఆమెతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ధోని శనివారం నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డేల సిరిస్‌కు సిద్ధమవుతున్నాడు. ఈ సిరిస్‌ ముగిసిన తర్వాత న్యూజిలాండ్ సిరిస్, ఆ తర్వాత ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు రానుంది.

ఈ సిరిస్‌లలో రాణించి ధోని తిరిగి ఫామ్‌ను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. వన్డే వరల్డ్‌కప్ ఆరంభానికి ముందు భారత్ 13 వన్డేలు మాత్రమే ఆడనుండటంతో అందరి దృష్టి ధోనిపైనే ఉంది.

Story first published: Friday, January 11, 2019, 10:05 [IST]
Other articles published on Jan 11, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+