Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్నో మ్యాన్‌ను ఇలా రూపొందించాలి: ధోనికి సాయం చేసిన జీవా (వీడియో)

Watch: MS Dhoni Makes Snowman With Ziva, Sakshi Shares Live Video On Instagram

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌కు గత కొన్ని నెలలుగా దూరంగా ఉంటోన్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రస్తుతం కుటుంబ సభ్యులతో గడుపుతున్నాడు. ఇటీవలే తన భార్య సాక్షితో కలిసి ధోని నూతన సంవత్సరాన్ని ఘనంగా జరుపుకున్నాడు.

తాజాగా డెహ్రాడూన్‌లోని ఓ హిల్‌స్టేషన్‌లో మంచు కురుస్తున్న వేళ ధోని తన కుమార్తె జీవాతో కలిసి సందడి చేశాడు. ఈ సందర్భంగా ధోనికి జీవా స్నో మ్యాన్‌ను తయారు చేయడంలో సాయపడింది. ఇందుకు సంబంధించిన వీడియోని సాక్షి ధోని తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొత్త ఏడాదిని కుటుంబంతో కలిసి ఘనంగా జరుపుకునేందుకు ధోని డెహ్రాడూన్‌ విహారయాత్రకు వెళ్లాడు. ధోనీ, జీవా కలిసి స్నో మ్యాన్‌ని రూపొందిస్తుండగా తీసిన వీడియోను సాక్షి సోషల్‌మీడియాలో అభిమానులతో పంచుకుంది.

ప్రస్తుత క్రికెట్‌లో అత్యుత్తమ కీపర్ ఎవరంటే ధోనీనే అని చెపుతారు. తనను మించిన కీపర్ లేడనేంతగా ప్రభావం చూపాడు. ధోనీ 2009-2019లో భారత్ తరపున 196 వన్డేలు ఆడాడు. 242 మంది బ్యాట్స్‌మన్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. ఇందులో 170 క్యాచులు, 72 స్టంపింగ్‌లు ఉన్నాయి.

ఇక మొత్తం కెరీర్‌లో 350 వన్డేల్లో 321 క్యాచులు, 123 స్టంపింగ్‌లు చేసాడు. ప్రపంచకప్ 2019 ముగిసినప్పటి నుండి ధోనీ విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ-ఫైనల్‌లో ధోనీ చివరిసారిగా ఆడాడు. ధోనీ పునరాగమనం ఐపీఎల్‌పై ఆధారపడి ఉంది.

Story first published: Saturday, January 4, 2020, 17:39 [IST]
Other articles published on Jan 4, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+