Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

4వ వన్డే ఓటమి: ఒంటరిగా ధోని, బాధతో ఏడ్చేంత పని చేశాడా?

హైదరాబాద్: ఏది అయితేనేం కరేబియన్ గడ్డపై టీమిండియా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఐదు వన్డేల సిరిస్‌ను 3-1 తేడాతో సిరీస్‌ను భారత్ సొంతం చేసుకుంది. తొలి వన్డే వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత జరిగిన రెండో వన్డేల్లో టీమిండియా విజయం సాధించగా, నాలుగో వన్డేలో విండిస్ విజయం సాధించింది. సిరిస్ ఫలితాన్ని తేల్చేందుకు ఐదో వన్డే కీలకంగా మారింది. గురువారం కింగ్‌స్టన్‌లో జరిగిన చివరి వన్డేలో విండిస్‌పై 8 వికెట్ల తేడాతో భారత్‌ విజయం సాధించి సిరిస్ నెగ్గింది.

నాలుగో వన్డే మాదిరి ఐదో వన్డేలో కూడా విండిస్ అద్భుత ప్రదర్శన చేసి ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేది. కానీ నాలుగో వన్డేలో లాగే ఛేదనలో భారత్‌ను కట్టడి చేసి సిరీస్‌ను సమం చేయాలనుకున్న విండీస్‌ ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ సెంచరీతో కదం తొక్కడంతో విండిస్ తేలిపోయింది.

ఈ క్రమంలో నాలుగో వన్డేలో చోటు చేసుకున్న ఓ సంఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఆంటిగ్వా వేదికగా సర్ వివ్ రిచర్డ్స్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో కోహ్లీసేనపై వెస్టిండిస్ 11 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

4వ వన్డేలో చివరి వరకు పోరాడి ఓటమి పాలైన కోహ్లీసేన

4వ వన్డేలో చివరి వరకు పోరాడి ఓటమి పాలైన కోహ్లీసేన

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన విండీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. 190 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా చివరి వరకు పోరాడి ఓటమి పాలైంది. ఒకవైపు టపటపా వికెట్లు పడుతున్నా.. మరోవైపు క్రీజులో ధోనీ ఉండటంతో చివరివరకు టీమిండియా గెలుపు ధీమాతో ఉంది. కానీ, ధోనీ ఈ పిచ్‌పై పరుగులు రాబట్టడం గగనమైంది.

49వ ఓవర్‌లో అవుటైన ధోని

49వ ఓవర్‌లో అవుటైన ధోని

సింగిల్స్‌ కూడా కష్టమైన దశలో ధోనీ 49వ ఓవర్‌ చివరి బంతికి భారీ షాట్‌ ఆడబోయి అవుటయ్యాడు. లక్ష్యఛేదనకు ఏడు బంతులకు 14 పరుగులు చేయాల్సిన దశలో ధోని అవుట్ కావడంతో వెస్టిండీస్‌ విజయం ఖాయమైంది. ధోని అవుటైన తర్వాత టీమిండియా వరుసగా వికెట్లను కోల్పోయింది. 49.4 ఓవర్‌లో 178 పరుగులకు భారత్‌ ఆలౌటైంది. దీంతో కోహ్లీసేనపై వెస్టిండిస్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది.

విండిస్ ఆటగాళ్లు సంతోషం

విండిస్ ఆటగాళ్లు సంతోషం

నాలుగో వన్డేలో విండిస్ విజయం సాధించడంతో ఆటగాళ్లు సంతోషంగా ఒకరిని మరొకరు అభినందించుకున్నారు. అయితే స్వల్ప లక్ష్యాన్ని చేధించడంలో భారత్ విఫలమైందన్న బాధతో ధోని డ్రెస్సింగ్ రూమ్‌లో ఒంటరిగా కూర్చున్నాడు. అంతేకాదు ధోని కంటతడి పెట్టినట్లుగా టీవీ ఇమేజి వీడియోల్లో మనం చూడొచ్చు. నిజానికి ఈ ఓటమి కెరీర్‌పై పెద్దగా ప్రభావం చూపదు. అయినప్పటికీ గతంలో ఎన్నడూ చూడని విధంగా ఈ మ్యాచ్ ఓటమితో ధోని ముభావంగా అలా చూస్తూ కూర్చుండి పోయాడు.

కెరీర్‌లో ఎన్నో గెలుపు ఓటములు

నిజానికి ధోని తన కెరీర్‌లో ఎన్నో గెలుపు ఓటములను చూశాడు. అయితే ఈ ఓటమి ఎందుకో ధోని మనసుని తాకిందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఈ మ్యాచ్‌లో ధోని ఓ చెత్త రికార్డుని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ధోని 46 ఓవర్‌ వరకు ఎంతో నిదానంగా.. మరెంతో ఓపిగ్గా ఆడిన 114 బంతుల్లో 54 పరుగులు చేశాడు. ఇందులో అర్ధసెంచరీని సాధించడానికి ధోనికి 108 బంతులు అవసరమయ్యాయి. దీంతో ధోని తన పేరు మీద ఓ చెత్త రికార్డుని మూటగట్టుకున్నాడు. వన్డేల్లో అత్యంత నెమ్మదిగా అర్ధ సెంచరీని చేసిన భారత బ్యాట్స్‌మన్‌లలో ఒకడిగా నిలిచాడు. ఇది కూడా ధోనిపై ప్రభావం చూపించి ఉండొచ్చని అంటున్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Read in English: MS Dhoni almost in tears
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+