ఆ బంతిని బుమ్రా మిస్ చేసి ఉంటే: మ్యాచ్‌ని మలుపు తిప్పిన రనౌట్ (వీడియో)
హైదరాబాద్: మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా చివరిదైన మూడో వన్డేలో కోహ్లీసేన అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం కాన్పూర్‌లోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
మ్యాచ్ మొత్తానికి హైలెట్‌గా నిలిచింది
ఈ మ్యాచ్ మొత్తానికి హైలెట్‌గా నిలిచిన ఓ సన్నివేశాన్ని బీసీసీఐ తన ఫేస్‌బుక్ పేజిలో పోస్టు చేసింది. ఈ వీడియోలో ధోని తెలివిగా బుమ్రాకి బంతిని అందించడం నుంచి... బుమ్రా ఆ బంతిని నేరుగా వికెట్లకేసి కొడుతూ కివీస్ బ్యాట్స్‌మెన్ టామ్ లాథమ్ రనౌట్ అవడం వరకు అందులో ఉంది.

ఈ రనౌట్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చివేసింది
ముఖ్యంగా ఈ రనౌట్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చవేసిందని చెప్పాలి. మూడో వన్డేలో మ్యాచ్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన న్యూజిలాండ్ ఒకానొక సందర్భంలో భారత్ నిర్దేశించిన 338 పరుగుల విజయ లక్ష్యాన్ని చేధించేలా కనిపించింది. అంతేకాదు టామ్ లాథమ్ క్రీజులో ఉన్నంత వరకు కివీస్ గెలుపు ధీమాతో ఉంది.

చేధనలో తడబడిన న్యూజిలాండ్
ఎప్పుడైతే టామ్ లాథమ్ ఈ రనౌట్‌తో పెవిలియన్‌కు చేరాడో... న్యూజిలాండ్ లక్ష్య చేధనలో తడబడింది. చివరి ఓవర్లో 15 పరుగులు సాధించాల్సిన దశలో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ వేసి 9 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, ధోని ఇచ్చిన బంతి గనుక బుమ్రా మిస్ చేసి ఉంటే, పరిస్థితి మరోలా ఉండేది.

వరుసగా ఏడు వన్డే సిరీస్‌లను గెలుచుకున్న కోహ్లీసేన
ఏది ఏమైనా... ధోని నుంచి బంతిని అందుకుని కివీస్ ఆటగాడు టామ్ లాథమ్‌ని బుమ్రా రనౌట్ చేయడం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. కాగా, ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా కోహ్లీసేన వరుసగా ఏడు వన్డే సిరీస్‌లు గెలుచుకున్న జట్టుగా అవతరించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications