Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రనౌట్ మిస్: క్రీజులో ధోని కోపాన్ని ఎప్పుడైనా చూశారా? (వీడియో)

హైదరాబాద్: మహేంద్ర సింగ్ ధోని అంటేనే కెప్టెన్ కూల్. చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో అలాంటి ధోనికి కూడా కోపమొచ్చింది. ఆదివారం ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలో ధోని (88 బంతుల్లో 79; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), పాండ్యా (66 బంతుల్లో 83; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) రాణించడంతో భారత్‌ 26 పరుగుల తేడాతో ఆసీస్‌పై విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో ధోని ఓ అరుదైన రికార్డుని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. తన అంతర్జాతీయ కెరీర్‌లో ధోని వందో హాఫ్ సెంచరీని పూర్తి నమోదు చేశాడు. టెస్టుల్లో 66 హాఫ్ సెంచరీలు, వన్డేల్లో 33, టీ20ల్లో ఒక హాఫ్ సెంచరీతో ధోని ఈ అరుదైన మైలురాయిని అందుకున్నాడు.

100వ హాఫ్ సెంచరీ చేసిన ధోని

100వ హాఫ్ సెంచరీ చేసిన ధోని

అంతర్జాతీయ కెరీర్‌లో ఇలా వందో హాఫ్ సెంచరీ అందుకున్న భారత క్రికెటర్ల జాబితాలో సచిన్ 164 హాఫ్ సెంచరీలతో అగ్రస్ధానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్ధానాల్లో రాహుల్ ద్రవిడ్(146), సౌరవ్ గంగూలీలు(107) ఉండగా... వీరి తర్వాత ధోని నాలుగో స్థానంలో నిలిచాడు. అంతేకాదు మొత్తంగా ప్రపంచంలోనే ఈ 100 హాఫ్ సెంచరీలు సాధించిన 13వ బ్యాట్స్‌మెన్‌గా ధోని అరుదైన ఘనత సాధించాడు.

ధోనిని రనౌట్ చేసే అవకాశాన్ని చేజార్చుకున్న ఆసీస్

ధోనిని రనౌట్ చేసే అవకాశాన్ని చేజార్చుకున్న ఆసీస్

కాగా, తొలి వన్డేలో రోహిత్ శర్మ అవుటైన క్రీజులోకి వచ్చిన ధోనిని రనౌట్ చేసే అవకాశాన్ని ఆస్ట్రేలియా చేజార్చుకుంది. కేదార్‌ జాదవ్‌ అజాగ్రత్త వల్ల ధోనీ రనౌట్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే అదృష్టం బాగుండి ఫీల్డర్ విసిరిన బంతి వికెట్లను తగలకపోవడంతో ధోని బతికి బయటపడటం ఆ తర్వాత ధోని చెలరేగడం జరిగింది.

22వ ఓవర్‌లో చోటు చేసుకున్న ఘటన

22వ ఓవర్‌లో చోటు చేసుకున్న ఘటన

ఈ సంఘటన ఇన్నింగ్స్ 22వ ఓవర్‌లో చోటు చేసుకుంది. ఈ సమయంలో ప్రశాంతతకు మారుపేరైన ధోని తొలిసారి తనలోని ఉగ్రరూపాన్ని ప్రదర్శించాడు. కేదార్‌ జాధవ్‌ను కంటితోనే ఉరిమి చూడటం మ్యాచ్‌ని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న కెమెరా కంటపడింది.

అసలేం జరిగిందంటే?

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 86 పరుగులకే 4 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి ధోని వచ్చాడు. 22వ ఓవర్‌లో ధోని 7 పరుగుల వద్ద ఉండగా రనౌట్ అయ్యే పరిస్థితి వచ్చింది. బంతిని కవర్‌ దిశగా మళ్లించిన ధోని వెంటనే పరుగుకు ఉపక్రమించాడు.

ధోని ఉగ్రరూపం

ధోని ఉగ్రరూపం

దీంతో ధోని పరుగు తీశాడు. కానీ పరుగు తీసిన అనంతరం కేదార్‌ను ధోని తన కంటితో ఉరుముతూ ఆవేశంతో చూశాడు. ఇదేమీ తీరు అన్నట్టు తల పంకించాడు. ఆ వెంటనే 40 పరుగులు చేసిన కేదార్‌ మార్కస్‌ బౌలింగ్‌లో కార్ట్‌రిట్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరగడం గమనార్హం. ఎప్పుడూ కూల్‌గా ఉండే ధోని ఇలా ఉగ్రరూపంతో చూడటం అభిమానుల దృష్టి ఆకర్షించింది.

స్పందించని కేదార్ జాదవ్

స్పందించని కేదార్ జాదవ్

కానీ, మరో ఎండ్‌లో ఉన్న కేదార్‌ జాదవ్‌ మాత్రం స్పందించలేదు. దీంతో మైదానంలో మధ్యలోకి వెళ్లిన ధోని కాస్తా తడబడి.. తిరిగి వెనక్కి మళ్లే ప్రయత్నంచేశాడు. ఇంతలో బంతి అందుకున్న ఆసీస్ ఫీల్డర్ కార్ట్ రైట్ హడావిడిగా వికెట్ల వైపు బంతిని విసిరాడు. బంతి కాస్తా వికెట్లను తాకకుండా ఓవర్‌ త్రో అయింది.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+