Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చెన్నై సూపర్ కింగ్స్ ఆట మొదలైంది

MS Dhoni Gets In The Groov

హైదరాబాద్: రెండేళ్ల నిషేధం ముగిసిన తర్వాత ఐపీఎల్ బరిలోకి చెన్నై సూపర్‌కింగ్స్‌ దిగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ధోనీ జట్టులోని ఆటగాళ్లందరూ ఇళ్ల నుంచి బయల్దేరి మ్యాచ్ కోసం సిద్ధమైయ్యారు. కెప్టెన్ ధోనీ ఇప్పటికే ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశారు. ఇందులో భాగంగానే జట్టు తొలి ప్రాక్టీస్‌ సెషన్‌ గురువారం జరిగింది.

చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

ఇందులో విదేశీ క్రికెటర్లు మినహా కీలక ఆటగాళ్లంతా హాజరయ్యారు. ఐపీఎల్ లోనే తొలి మ్యాచ్‌ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ముంబై ఇండియన్స్ తో తలపడనుంది. ముంబై వేైదికగా జరగనున్న ఈ మ్యాచ్ ఏప్రిల్ 7న క్రికెట్ అభిమానులను అలరించనుంది. కానీ, ధోనీ సేన చెన్నై గడ్డపై ఆడనున్న తొలి మ్యాచ్ మాత్రం ఏప్రిల్‌ 10న కోల్‌కత్తా జట్టుతో ఆడుతుంది.

కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..

ఈ ఐపీఎల్ కోసం బీసీసీఐ భారత జట్టులోని కొందరు ఆటగాళ్లకు విరామం ఇచ్చింది. నిదహాస్ ట్రోఫీలో ఆడకుండా విరామం తీసుకున్న ఆటగాళ్లతో పాటు నిదహాస్ ట్రోఫీలో రాణించిన క్రికెటర్లు సైతం ఐపీఎల్‌కు సిద్ధమైయ్యారు.

మరోసారి సత్తా చాటేందుకు సిద్ధం:

ఐపీఎల్ పదకొండో సీజన్‌కు సిద్ధమవుతోన్న చెన్నై జట్టుకు ఉన్న ప్రత్యేకతల్లో ప్రధాన ఆటగాళ్లందరూ 30ప్లస్ వయస్సు కలిగి ఉండటమే. ఇది ధోనీ ఆలోచనే అని పలువురి విమర్శకుల వాదన. ధోనీ తన ఐపీఎల్ కెరీర్‌ను 2010 సంవత్సరం నుంచి ఆడటం మొదలుపెట్టాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపును ఆడి ఈ పదేళ్లలో 3561పరుగులను సాధించాడు. మొత్లం 159మ్యాచ్‌లు, ఆడిన ధోనీ అత్యధిక స్కోరు 70 మాత్రమే.

సింహాలు సిద్ధం:

కెప్టెన్ ఎంఎస్ ధోనీతో కలిసి సంభాషణ జరుపుతున్న టీం సభ్యులు సురేశ్ రైనా, మురళీ విజయ్ తదితరులు

హర్భజన్ సింగ్-అంబటి రాయుడు:

మాజీ ముంబై ఇండియన్స్ క్రికెటర్లు హర్భజన్ సింగ్, అంబటి రాయుడు కొత్త జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌కు తరపున ఆడనున్నారు. సెల్ఫీకి సిద్ధమైన జట్టు సభ్యులు హర్బజన్ సింగ్, మురళీ విజయ్

జట్టు సభ్యుల ముచ్చట్లు

హర్భజన్ సింగ్, డేన్ బ్రావో, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ కొత్త జెర్సీతో సమావేశమైన దృశ్యం.

చెన్నైకు చేరుకున్న రైనా

ధోనీ తలా అని పిలుచుకునే చెన్నై వాసులు రైనాను చిన్న తలైవా అని పిలుచుకుంటున్నారు. రైనా చెన్నై జట్టు తరపున ఆడేందుకు తరలివచ్చాడు.

Story first published: Friday, March 23, 2018, 13:37 [IST]
Other articles published on Mar 23, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+