For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనికి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చేందుకు వచ్చిన అభిమానిని పరిగెత్తించాడు (వీడియో)

India vs Australia 2nd ODI : Dhoni Dodges Fan, Makes Him Run For Embrace During 2nd ODI vs Australia
Watch: MS Dhoni Dodges Fan, Makes Him Run For Embrace During 2nd ODI vs Australia

హైదరాబాద్: ధోని కోసం అభిమానులు స్టేడియంలోని భద్రతా వలయాన్ని దాటుకుని మైదానంలోకి వస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో ధోని కోసం ఓ అభిమాని పెద్ద సాహసమే చేశాడు. అంతేకాదు ఆ అభిమానిని ధోని కోసం మైదానంలో పరిగెత్తాడు.

భారత్‌ బ్యాటింగ్‌ ముగిసిన తర్వాత ఫీల్డింగ్‌ చేయడానికి జట్టు సభ్యులు మైదానంలోకి వెళుతున్న సమయంలో ధోనికి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చేందుకు అభిమాని యత్నించాడు. అయితే అభిమాని నుంచి తప్పించుకునేందుకు ధోని మైదానంలో పరుగులు తీశాడు. ఆ అభిమాని సైతం ధోనిని వదలకుండా పరుగు తీశాడు.

1
45586

వికెట్ల వద్ద నిలబడిపోయిన ధోని

చివరకు ఎంతకూ ఆ అభిమాని వదలకపోవడం ధోని వికెట్ల వద్ద నిలబడిపోయాడు. దీంతో ధోనిని అభిమాని గట్టిగా ఆలింగనం చేసుకుని ఆనందంతో మురిసిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. రెండో వన్డేలో ధోని గోల్డెన్‌ డకౌటయ్యాడు. ఇటీవల న్యూజిలాండ్ గడ్డపై ఓ అభిమాని జాతీయ జెండా చేబూని మరీ ధోని పాదాలపై పడేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే.

రెండో వన్డేలో ధోని గోల్డెన్ డకౌట్

రెండో వన్డేలో ధోని గోల్డెన్ డకౌట్

ఈ మ్యాచ్‌లో ధోని గోల్డెన్ డక్ రూపంలో పెవిలియన్ చేరాడు. కేదార్‌ జాదవ్‌(11) ఐదో వికెట్‌గా పెవిలియన్‌ చేరిన తర్వాత క్రీజులోకి వచ్చిన ధోని.. తాను ఆడిన తొలి బంతికే ఔట్‌ అయ్యాడు. ఆడమ్‌ జంపా వేసిన 33 ఓవర్‌ మూడో బంతిని కవర్స్‌ మీదుగా షాట్‌ ఆడాడు. అయితే, ఫస్ట్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఖవాజా క్యాచ్‌ పట్టడంతో ధోని ఇలా వచ్చి అలా పెవిలియన్‌ చేరాడు.

కెరీర్‌లో ఐదోసారి

కెరీర్‌లో ఐదోసారి

తన వన్డే కెరీర్‌లో ధోని ఇలా గోల్డెన్‌ డక్‌గా ఔట్‌ కావడం ఐదోసారి. అంతేకాదు తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ అదే జట్టుపై ధోని గోల్డెన్ డకౌటయ్యాడు. తన 2004లో బంగ్లాదేశ్‌తో చిట్టగాంగ్‌ వేదికగా జరిగిన వన్డేలో ధోనీ తొలి బంతికే ఔట్ అయ్యాడు. ఆ తర్వాత 2005లో శ్రీలంకతో అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో, 2007లో మరోసారి శ్రీలంకతో పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో, చివరిగా 2010లో వైజాగ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ధోని తొలి బంతికే గోల్డెన్‌ డక్‌గా నిష్క్రమించాడు.

వన్డేల్లో కోహ్లీ 40వ సెంచరీ

వన్డేల్లో కోహ్లీ 40వ సెంచరీ

రెండో వన్డేలో టీమిండియా విరాట్ కోహ్లి (116; 120 బంతుల్లో 10 ఫోర్లు) సెంచరీకి తోడు విజయ్‌ శంకర్‌(46; 41 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) ఆకట్టుకోవడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన 48.2 ఓవర్లలోనే 250 పరుగులు చేసి ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో జడేజా 21 పరుగులు చేశాడు. దీంతో ఆస్ట్రేలియాకు 251 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆస్ట్రేలియా జట్టులో పాట్ కమిన్స్ నాలుగు వికెట్లు తీయగా.. ఆడమ్ జంపా రెండు, కౌల్టర్‌ నైల్, మాక్స్‌వెల్, నాథన్ లయాన్ తలో వికెట్ తీశారు.

Story first published: Wednesday, March 6, 2019, 13:15 [IST]
Other articles published on Mar 6, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+