తొలి బౌండరీ కావడంతో ఒక్కసారిగా ఆనందంలో
వన్డేల్లో అతనికిది తొలి బౌండరీ కావడంతో ఒక్కసారిగా ఆనందంలో మునిగిపోయాడు. ఈ క్రమంలో బ్యాట్ పైకెత్తి డ్రెస్సింగ్ రూమ్ వైపు చూపిస్తూ సంబరాలు కూడా చేసుకున్నాడు. మరోవైపు డ్రెస్సింగ్ రూమ్‌లోని భారత ఆటగాళ్లు ఓటమి బాధలో ఉన్నప్పటికీ.. చాహల్ సంబరాలు చూసి కాసేపు నవ్వుకున్నారు. అంతేకాదు, ఆ తర్వాత ఒక పరుగుకు యత్నించి రనౌట్ అయిపోతాడనుకున్న క్రమంలో.. అతను ముందుకు డైవింగ్ చేసే పద్ధతి కూడా నవ్వు తెప్పించింది.

రూట్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు:
జింబాబ్వేపై 2016లో చాహల్ వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకూ 25 వన్డేలు ఆడి.. 45 వికెట్లు తీసుకున్నాడు. ఇక 26 టీ20ల్లో ఈ లెగ్‌స్పిన్నర్ 42 వికెట్లు తీశాడు. లక్ష్యఛేదనలో తడబడిన భారత్ 50 ఓవర్లలో 236 పరుగులకే ఆలౌటైంది. రైనా (46; 63 బంతుల్లో ఒక ఫోర్), కోహ్లి (45; 56 బంతుల్లో 2ఫోర్లు) రాణించారు. ప్లంకెట్ (4/46), రషీద్ (2/38), విల్లీ (2/48) భారత్‌ను దెబ్బతీశారు. రూట్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. ధోని (37; 59 బంతుల్లో 2ఫోర్లు), హార్దిక్ పాండ్య (21) క్రీజులో ఉన్నప్పుడు భారత్ కాస్త ఆశతోనే ఉంది.

పేలవ ప్రదర్శనతో 86పరుగుల తేడా
కానీ 39వ ఓవర్లో పాండ్య ఔట్ కావడంతో అది కూడా పోయింది. ధోని 47వ ఓవర్‌కు వరకు క్రీజులోనే ఉన్నా భారత్ ఏ దశలోనూ గెలిచేలా కనపడలేదు. కష్టంగా పరుగులొచ్చాయి. ధోని ఆట ఓటమి అంతరాన్ని తగ్గించడానికి సరిపోయిందంతే. టెయిలెండర్ల నుంచి ఎలాంటి ప్రతిఘటనా లేదు. ఈ మ్యాచ్‌లో భారత్‌పై ఇంగ్లాండ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ పేలవ ప్రదర్శనతో 86పరుగుల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది.

మాజీ కెప్టెన్ ధోనీ రెండు రికార్డులు
ఇదే మ్యాచ్‌లో భారత మాజీ కెప్టెన్ ధోనీ రెండు రికార్డులు చేరుకున్నాడు. ఈ మ్యాచ్ అనంతరం పదివేల పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా నిలవడంతోపాటు.. 300 క్యాచ్‌లు పట్టిన వికెట్ కీపర్‌గా కూడా ధోనీ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్ విజయంతో మూడు వన్డేల ఈ సిరీస్‌ను ఇంగ్లాండ్ 1-1తో సమం చేసింది. దీంతో.. మూడు వన్డేల సిరీస్ 1-1తో సమమవగా.. సిరీస్ విజేత నిర్ణయాత్మక మూడో వన్డే మంగళవారం జరగనుంది.


Click it and Unblock the Notifications

