Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సిడ్నీ టెస్ట్‌ లో కేఎల్ రాహుల్‌ క్రీడా స్ఫూర్తి: సోషల్ మీడియాలో వీడియో వైరల్

India vs Australia 4 Test : KL Rahul Gets Praise From Umpire For His sportive Spirit | Oneindia
Watch: KL Rahul wins hearts with elite honesty, displays sportsman spirit on the field

హైదరాబాద్: సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియా ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ నిజమైన క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాడు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా గురువారం ప్రారంభమైన సిడ్నీ టెస్టులో కేఎల్ రాహుల్ తన నిజాయతీతో అభిమానుల మనుసు గెలుచుకున్నాడు.

డైవ్‌ చేసి అద్భుతమైన రీతిలో క్యాచ్‌ పట్టినప్పటికీ.. అది ఔట్‌ కాదంటూ తనంతట తానే ప్రకటించి నిజాయతీ చాటుకున్నాడు. చివరి టెస్టు మూడో రోజైన శనివారం ఆటలో భాగంగా ఇన్నింగ్స్ 15వ ఓవర్‌ను రవీంద్ర జడేజా వేశాడు. తొలి బంతికే ఆసీస్‌ ఓపెనర్‌ మార్కస్‌ హరీస్‌ మిడాన్‌ దిశగా భారీ షాట్‌కు యత్నించాడు.

1
43626

డైవ్‌‌ చేసి మరీ క్యాచ్‌ పట్టిన కేఎల్ రాహుల్

ఆ బంతి నేరుగా ఫీల్డర్‌ కేఎల్‌ రాహుల్‌ వైపు వెళ్లింది. అదే సమయంలో అక్కడే ఫీల్డింగ్ చేస్తోన్న కేఎల్ రాహుల్‌ అద్భుతమైన రీతిలో డైవ్‌‌ చేసి మరీ క్యాచ్‌ పట్టాడు. అయితే, అందరూ అది ఔట్‌ అని అనుకున్నారు. కానీ, క్యాచ్‌కు ముందు బంతి నేలను తాకడంతో వెంటనే రాహుల్‌ అది క్యాచ్‌ కాదంటూ చేతులను ఊపుతూ సిగ్నల్‌ ఇచ్చాడు.

మెచ్చుకున్న బుమ్రా

మెచ్చుకున్న బుమ్రా

వెంటనే బుమ్రా.. రాహుల్‌ వద్దకు వచ్చి తలపై తడుతూ మెచ్చుకున్నాడు. ఫీల్డ్‌ అంపైర్‌ ఇయాన్‌గౌల్డ్‌ కూడా రాహుల్‌ నిజాయతీకి మెచ్చి ‘అద్భుతం.. బాగా చేశావ్‌' అంటూ కొనియాడాడు. కాగా, కేఎల్ రాహుల్‌ క్రీడాస్ఫూర్తికి పలువురు క్రికెట్‌ అభిమానులు సోషల్ మీడియాలో ప్రసంసలు కురిపిస్తున్నారు.

నిజాయతీని చాటుకున్న కేఎల్ రాహుల్

నిజాయతీని చాటుకున్న కేఎల్ రాహుల్

థర్డ్ అంఫైర్‌పై ఆధారపడకుండా రాహుల్‌ తన నిజాయతీని చాటుకున్నాడంటూ ప్రశంసిస్తున్నారు. ‘రాహుల్‌ క్రీడా స్ఫూర్తి మిగతా ఆటగాళ్లకు అనుసరణీయం', ‘చీటింగ్‌కు పాల్పడే ఆటగాళ్లు రాహుల్‌ నుంచి ఎంతో నేర్చుకోవాలి' ‘అంపైర్‌ సమయాన్ని వృథా చేయకుండా వెంటనే రాహుల్‌ స్పందించాడు' అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ముగిసిన మూడో రోజు ఆట, ఆస్ట్రేలియా 236/6

ముగిసిన మూడో రోజు ఆట, ఆస్ట్రేలియా 236/6

ఇదిలా ఉంటే, నాలుగో టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. సిడ్నీలో భారీ వర్షం, వెలుతురు లేమి కారణంగా అంఫైర్లు మ్యాచ్‌ను నిలిపేశారు. దీంతో ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ 236/6 పరుగులు చేసింది. మూడో రోజు ఆటలో టీమిండియా బౌలర్లు విజృంభించడంతో తొలి ఇన్నింగ్స్ ఆసీస్‌ తడబడుతోంది. ప్రస్తుతం క్రీజులో పాట్‌ కమిన్స్‌(25), హాండ్స్‌ కాంబ్‌(28) ఉన్నారు. కుల్దీప్‌ మూడు వికెట్లు, జడేజా రెండు, షమీ ఒక వికెట్‌ తీశారు.

Story first published: Saturday, January 5, 2019, 12:29 [IST]
Other articles published on Jan 5, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+