ఓవర్‌లో ఐదు సిక్సులు: బీబీఎల్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా!

హైదరాబాద్: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌లో బ్రిస్బేన్ హీట్ తరుపున ప్రాతినిథ్యం టామ్ బాంటన్ సోమవారం అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. బిగ్‌బాష్ లీగ్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. టోర్నీలో భాగంగా సోమవారం సిడ్నీ థండర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పరుగుల వరద పారించాడు.
16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ
కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. సిడ్నీ బౌలర్ అర్జున్ నాయర్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో బాంటన్ ఏకంగా ఐదు సిక్సర్లు బాదాడు. ఇందుకు సంబంధించిన వీడియోని బీబీఎల్ తన అధికారిక ట్విటర్‌లో అభిమానులతో పంచుకుంది. వర్షం అడ్డంకిగా మారిన ఈ మ్యాచ్‌ని తొలుత మ్యాచ్‌ను 8 ఓవర్లకు కుదించారు.
4 వికెట్ల నష్టానికి 119 పరుగులు
దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన బ్రిస్బేన్ 4 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. టామ్ బాంటన్(19 బంతుల్లో 56; 2ఫోర్లు, 7 సిక్సర్లు)కు తోడు క్రిస్ లిన్(31; 13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సిడ్నీ ఐదు ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 60 పరుగులతో ఉన్న క్రమంలో వర్షం అడ్డంకిగా మారింది.
రూ. కోటికి కేకేఆర్ కొనుగోలు
ఆ తర్వాత ఎంతకీ వర్షం తగ్గుముఖంపట్టక పోవడంతో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం బ్రిస్బేన్ 16 పరుగుల తేడాతో విజయం సాధించినట్లు అంఫైర్లు ప్రకటించారు. కాగా, ఇటీవలే కోల్‌కతా వేదికగా ముగిసిన ఐపీఎల్ వేలంలో ఇంగ్లాండ్‌కు చెందిన టామ్ బాంటన్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) కనీస ధర రూ. కోటికి కొనుగోలు చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications