న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బుల్లి చిరుతకు పాలు పట్టించిన ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ పీటర్సన్

By Nageshwara Rao
Watch: Kevin Pietersen Adopts Baby Leopard In India, Earns Plaudits On Social Media

హైదరాబాద్: ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్‌కు క్రికెట్‌తో పాటు జంతువులంటే ఎంతో ఇష్టం. ఈ విషయాన్ని అనేక సార్లు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. గత వారం ఇండియాకు వచ్చిన పీటర్సన్ రాయ్‌పూర్‌లో ఒక బుల్లి చిరుతను దత్తత తీసుకున్నాడు.

ఈ ఏడాది జనవరిలో ఇండియాలో దాదాపు 40 చిరుతలను వేటగాళ్లు చంపేయడం బాధించిందని, అందుకే అనాథగా ఉన్న చిరుత పిల్లను అక్కున చేర్చుకున్నానని పీటర్సన్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. అంతేకాదు ఛత్తీస్‌గఢ్‌కు వచ్చిన పీటర్సన్ ఆ చిరుత ఒక సీసా ద్వారా పాలు పట్టించాడు.

ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి.. ఇందులోనే సంతోషం ఉన్నది. నా చిన్నారి చిరుత ఎంత అందంగా ఉన్నదో? అన్న కామెంట్‌ను కూడా పోస్టు చేశాడు.

HAPPINESS IN THIS! How beautiful is this baby Leopard????

A post shared by Kevin Pietersen (@kp24) on

ఈ వీడియో ఇప్పుడు వైరల్ కావడంతో పీటర్సన్‌ను అభినందిస్తున్నారు. అనంతరం ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్‌ను కలిసి సొరాయ్(సేవ్ అవర్ రైనోస్ ఆఫ్రికా, ఇండియా)పై కాసేపు చర్చించాడు. ఈ కార్యక్రమానికి సంబంధించిన టోపీని రమణ్‌ సింగ్‌కు అందజేశారు.

ఆఫ్రికా, ఆసియాలో అంతరించిపోతున్న ఖడ్గ మృగాలను కాపాడుకునే కార్యక్రమంలో పీటర్సన్ పాలుపంచుకుంటున్న సంగతి తెలిసిందే. వన్యప్రాణుల సంరక్షణ కోసం పీటర్సన్ చేస్తున్న కృషి అభినందనీయమని ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ఈ సందర్భంగా ప్రశంసలు కురిపించాడు.

Story first published: Tuesday, February 27, 2018, 15:06 [IST]
Other articles published on Feb 27, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X