Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs RR: ఎగిరి గంతేసిన కావ్య మారన్..గాల్లో తేలినట్టుందే! (Video)

ఆల్‌రౌండ్ షోతో సన్‌రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. చెపాక్ వేదికగా జరిగిన క్వాలిఫయిర్-2లో రాజస్థాన్ రాయల్స్‌పై 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆరేళ్ల తర్వాత తొలిసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆదివారం జరగనున్న టైటిల్ పోరు కోసం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది.

మందకొడి పిచ్‌పై తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 175 పరుగులు సాధించింది. హెన్రిచ్ క్లాసెన్ (50; 34 బంతుల్లో, 4x6) అర్ధశతకంతో సత్తాచాటాడు. రాహుల్ త్రిపాఠి (37; 12 బంతుల్లో, 5x4, 2x6), ట్రావిస్ హెడ్ (34; 28 బంతుల్లో, 3x4, 1x6) ఫర్వాలేదనిపించారు. రాజస్థాన్ బౌలర్లలో అవేశ్ ఖాన్ (3/27), ట్రెంట్ బౌల్ట్ (3/45) చెరో మూడు, సందీప్ శర్మ (2/25) రెండు వికెట్లు తీశారు.

Watch Kavya Maran s Celebration After SRH Seals Final Spot Goes Viral

అయితే సన్‌రైజర్స్ ఈ స్కోరు సాధించడానికి ఎంతో శ్రమించింది. వికెట్లను అడ్డుకొని కీలక భాగస్వామ్యాలు నెలకొల్పుతాడనుకుంటే మార్క్‌రమ్ ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. హిట్టర్ అబ్దుల్ సమద్ గోల్డెన్ డకౌటయ్యాడు. దీంతో 190 పరుగుల స్కోరు సాధిస్తుందనుకుంటే 175 పరుగులకే ఎస్‌ఆర్‌హెచ్ పరిమితమైంది.

ఈ లక్ష్యాన్ని సన్‌రైజర్ల బౌలర్లు కాపాడుకుంటారో లేదో అనే సందేహం ఆరెంజ్ ఆర్మీలో కలిగింది. కానీ ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లు సమష్టిగా సత్తాచాటారు. ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 139 పరుగులకే పరిమితమైంది. ధ్రువ్ జురెల్ (56*; 35 బంతుల్లో, 7x4, 2x6), యశస్వీ జైస్వాల్ (42; 21 బంతుల్లో, 4x4, 3x6) పోరాడారు. షాబాజ్ అహ్మద్ (3/23) మూడు, అభిషేక్ శర్మ (3/24) రెండు వికెట్లతో రాజస్థాన్‌ను చిత్తుచేశారు. నటరాజన్ (1/13), కమిన్స్ (1/30) చెరో వికెట్ తీశారు.

విజయానంతరం సన్‌రైజర్స్ సహయజమాని కావ్య మారన్ ఆనందంతో గాల్లో తేలిపోయింది. ఎప్పటిలానే ఎగిరి గంతేసి సంబరాలు చేసుకుంది. ప్లేయర్లపై తను ఉంచిన నమ్మకం నిజమైందన్నట్లుగా సంతోషంలో మునిగితేలింది. కావ్యకు సంబంధించిన సెలబ్రేషన్స్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కప్ అందుకున్న తర్వాత కావ్య మారన్‌ సంబరాలను చూడాలని ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Story first published: Saturday, May 25, 2024, 9:23 [IST]
Other articles published on May 25, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+