36 బంతుల్లో 88: రసెల్ గత సీజన్ ఇన్నింగ్స్‌ను గుర్తు చేసిన ధోని (వీడియో)

హైదరాబాద్: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్‌లో క్రికెట్ అభిమానులు అనేక మధుర క్షణాలను ఆస్వాదించారు. ముఖ్యంగా కోల్‌కతా ఆడిన కొన్ని మ్యాచ్‌ల్లో టీ20 క్రికెట్ మజాను రుచి చూసింది. కోల్‌కతా ఓటమి అంచుల్లో ఉన్న పలు మ్యాచ్‌ల్లో ఆండ్రీ రసెల్ ఒంటిచేత్తో గెలిపించాడు. ఈ సీజన్‌లో ఆండ్రీ రసెల్ అత్యంత ప్రమాదకరమైన బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్నాడు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

కోల్‌కతా గెలిచిన నాలుగు మ్యాచ్‌ల్లో రసెల్ కీలకపాత్ర
ఈ సీజన్‌లో కోల్‌కతా గెలిచిన నాలుగు మ్యాచ్‌ల్లో ఆండ్రీ రసెల్ కీలకపాత్ర పోషించాడు. ఈడెన్ గార్డెన్స్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 19 బంతుల్లో 49 పరుగులు... పంజాబ్‌పై 17బంతుల్లో 48 పరుగులు చేసి ఓటమి అంచున ఉన్న కోల్‌కతాను విజయతీరాలకు చేర్చాడు. ఇప్పటి వరకూ కోల్‌కతా ఆడిన 5 మ్యాచుల్లో రసెల్‌కు నాలుగు సార్లు బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది.

ఈ సీజన్‌లో 77 బంతులను ఎదుర్కొన్న రసెల్
ఈ సీజన్‌లో ఇప్పటివరకు మొత్తం 77 బంతులను ఎదుర్కొన్న ఆండ్రీ రసెల్ 103.50 యావరేజితో 207 పరుగులు చేశాడు. ఇందులో 22 సిక్సర్లు, 12 ఫోర్లు ఉన్నాయి. ఒక హాఫ్ సెంచరీని కూడా నమోదు చేశాడు. ఈ సీజన్‌లో రసెల్ అత్యధిక స్కోరు 62 పరుగులుగా ఉంది. కాగా, టోర్నీలో భాగంగా మంగళవారం కేకేఆర్... చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది.

రసెల్ గత సీజన్ ఇన్నింగ్స్‌ను గుర్తు చేసిన ధోని
ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఆండ్రీ రసెల్ గత సీజన్ ఇన్నింగ్స్‌ను ఒకసారి గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్ 2018లో చెపాక్ వేదికగా సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో ఆండ్రీ రసెల్ 36 బంతుల్లో 11 సిక్సుల సాయంతో 88 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇన్నింగ్స్‌పై ధోని మాట్లాడిన వీడియోని సీఎస్‌కే తన అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేసింది.
36 బంతుల్లో 11 సిక్సుల సాయంతో 88 పరుగులు
ఇందులో ధోని "నేను ఇప్పుడు గత పీడకలలోకి వెళ్లాలా? ఆ ఇన్నింగ్స్‌ను నేను మళ్లీ గుర్తు చేసుకోవాలా? జట్టులో మొత్తం 9 మంది ఫీల్డర్లు, ఒక బౌలర్, ఒక కీపర్ ఉన్నారు. మిగిలిన ఫీల్డర్లు సర్కిల్ వెలుపల ఉన్నారు. గ్రౌండ్ వెలుపల ఉండేందుకు ఎవరికీ అనుమతి లేదు(ఏ బ్యాట్స్‌మన్ అత్యధిక సిక్సులు బాదుతాడు?)" అంటూ ధోని సరదాగా రసెల్ గత ఇన్నింగ్స్‌ని గుర్తు చేసుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications