For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కేన్ మామ.. ఎలా ఉన్నావ్?- కావ్య మారన్ (Video)

ఉప్పల్ వేదికగా నిన్న జరగాల్సిన సన్‌రైజర్స్ హైదరాబాద్-గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కింది. ఈ నేపథ్యంలో 15 పాయింట్లకు చేరుకున్న ఎస్ఆర్‌హెచ్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. మరోవైపు గుజరాత్ 12 పాయింట్లతో ఈ సీజన్‌ను ముగించింది.

గుజరాత్ టైటాన్స్ ఆడాల్సిన గత రెండు మ్యాచ్‌లు వరుణుడి కారణంగానే రద్దవ్వడం గమనార్హం. కోల్‌కతా నైట్ రైడర్స్‌‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో గుజరాత్ ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతయ్యాయి. తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో అయినా గెలిచి సీజన్ విజయంతో ముగించాలనుకుంటే మరోసారి నిరాశే ఎదురైంది. అయితే ఎస్ఆర్‌హెచ్-గుజరాత్ మ్యాచ్ జరగనప్పటికీ ఉప్పల్‌లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.

Watch Kane Williamson Greets Kavya Maran with a Warm Hug

సన్‌రైజర్స్ మాజీ ప్లేయర్ కేన్ విలియమ్సన్‌తో సహ యజమాని కావ్య మారన్ ముచ్చటించారు.ఆలింగనం చేసుకుని ఆత్మీయంగా పలుకరించుకొని యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎలా ఉన్నావంటూ మాట్లాడుకున్న వాళ్ల వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఎస్‌ఆర్‌హెచ్ వదులుకోవడంతో విలియమ్సన్ గుజరాత్ టైటాన్స్‌కు వెళ్లిన విషయం తెలిసిందే.

హైదరాబాద్ జట్టు తరఫున కేన్ మామ 2015 నుంచి 2022 వరకు ప్రాతినిథ్యం వహించాడు. ఎస్‌ఆర్‌హెచ్‌కు 76 మ్యాచ్‌లు ఆడిన విలియమ్సన్ 36 సగటుతో 2101 పరుగులు చేశాడు. 18 హాఫ్ సెంచరీలు సాధించాడు. కెప్టెన్‌గానూ కేన్ అలరించాడు. 46 మ్యాచ్‌ల్లో జట్టును నడిపించాడు. 2018 సీజన్‌లో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. కానీ అంతిమ పోరుతో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిన సన్‌రైజర్స్ రన్నరప్‌గా నిలిచింది.

2018 సీజన్‌లో కేన్ విలియమ్సన్ ఆరెంజ్ క్యాప్‌ను సాధించాడు. 52 సగటు, 142 స్ట్రైక్‌రేటుతో 735 పరుగులు చేసిన అతడు అత్యధిక పరుగుల సాధించిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. అయితే గుజరాత్ టైటాన్స్‌కు వెళ్లిన కేన్ తుదిజట్టులో అవకాశం దక్కించుకోలేకపోతున్నాడు. ఈ సీజన్‌లో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. పంజాబ్ కింగ్స్‌పై 26 పరుగులు, లక్నో సూపర్ జెయింట్స్‌పై ఒక్క పరుగే సాధించాడు.

Story first published: Friday, May 17, 2024, 10:06 [IST]
Other articles published on May 17, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+