Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లంక పేసర్ వేగానికి బిత్తరపోయిన రబాడ.. రెండు ముక్కలైన బ్యాట్ (Video)

సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా జరుగుతున్న దక్షిణాఫ్రికా వర్సెస్ శ్రీలంక రెండో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో నిలవడానికి ఇరు జట్లు హోరాహోరీగా పోటీపడుతున్నాయి. రెండో రోజు ఆట ముగిసేసరికి తొలి ఇన్నింగ్స్‌లో లంక 67 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 242 పరుగులు చేసింది. ఓపెనర్ పాథుమ్ నిస్సాంక (89; 157 బంతుల్లో, 11 ఫోర్లు, 1 సిక్సర్) సత్తాచాటాడు.

ఏంజెలో మాథ్యూస్ (40 బ్యాటింగ్; 71 బంతుల్లో, 6 ఫోర్లు), కామిందు మెండిస్ (30 బ్యాటింగ్; 38 బంతుల్లో, 3 ఫోర్లు) క్రీజులో కొనసాగుతున్నారు. రబాడ, ప్యాటర్సన్, మహరాజ్ తలో వికెట్ తీశారు. దక్షిణాఫ్రికా కంటే శ్రీలంక 116 పరుగుల వెనుకంజలో ఉంది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 358 పరుగులు చేసింది. రికెల్టన్ (101; 250 బంతుల్లో, 11 ఫోర్లు), వెర్రెయిన్ (105 నాటౌట్; 133 బంతుల్లో, 12 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకాలతో కదం తొక్కారు. కెప్టెన్ బవుమా (78; 109 బంతుల్లో, 8 ఫోర్లు, 1 సిక్సర్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

Watch Kagiso Rabada s Bat Shattered by Lahiru Kumara s Thunderous Delivery

శ్రీలంక బౌలర్లలో లాహిరు కుమార (4/79) నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. అసిత ఫెర్నాండో (3/102) మూడు, విశ్వా ఫెర్నాండో (2/65) రెండు వికెట్లు తీశారు. అయితే కుమార వేసిన బంతిని ఎదుర్కొనే క్రమంలో రబాడ బ్యాటు రెండు ముక్కలైంది. 10వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కగిసో రబాడ లంక బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. 40 బంతుల్లో 5 ఫోర్లతో 23 పరుగులు చేశాడు. అయితే 90వ ఓవర్‌లో రబాడకు లాహిరు కుమార సవాలైన బంతుల్ని విసిరాడు.

నాలుగో బంతిని హార్డ్ లెంగ్త్‌తో కుమార సంధించాడు. శరీరం మీదకు వచ్చిన ఆ బంతిని ఒక్క చేతితో ఫార్వర్డ్ డిఫెన్స్‌కు రబాడ ప్రయత్నించాడు. బంతి హ్యాండిల్ సమీపంలో తగలడంతో బ్యాటు రెండు ముక్కలైంది. బ్యాటు‌కు కనెక్ట్ అవ్వకపోతే రబాడకు తీవ్ర గాయమయ్యే అవకాశం ఉండేది. కాగా, విరిగిన బ్యాటును మార్చుకుని కొత్త బ్యాటుతో రబాడ తిరిగి బ్యాటింగ్ కొనసాగించాడు. అయితే కొద్దిసేపటికే ఔటై పెవిలియన్‌కు చేరాడు.

Story first published: Saturday, December 7, 2024, 9:51 [IST]
Other articles published on Dec 7, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+