For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కళ్లు చెదిరే యార్కర్‌తో గేల్‌ను ఔట్ చేసిన జూనియర్ డాలా (వీడియో)

WATCH: Junior Dala cleans up Chris Gayle with a lethal yorker in Mzansi Super League

హైదరాబాద్: మాన్షి సూపర్ లీగ్‌లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా పేసర్ జూనియర్ డాలా తన అద్భుతమైన యార్కర్‌తో వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఈ టీ20 లీగ్‌లో క్రిస్ గేల్ జోజీ స్టార్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

టోర్నీలో భాగంగా శనివారం జోజీ స్టార్స్-నేల్సన్ మండేలాబే గెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో క్రిస్ గేల్‌ను డాలా ఔట్ చేసిన బంతి ఈ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. జోజీ స్టార్స్ ఇన్నింగ్స్ యొక్క 4వ ఓవర్ ఆఖరి బంతికి క్రిస్ గేల్ ఔటయ్యాడు. డాలా వేసిన అద్భుతమైన యార్కర్ వికెట్లను అమాంతం గాల్లోకి ఎగరవేసింది.

డాలా వేసిన ఈ బంతికి గేల్ వద్ద సమాధానమే లేకుండా పోయింది. దీంతో క్రిస్ గేల్(9 బంతుల్లో 11 పరుగులు) నిరాశగా పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాన్షి లీగ్‌లో క్రిస్ గేల్ ప్రదర్శన ఏమాత్రం ఆకట్టుకునే విధంగా లేదు.

View this post on Instagram

Wow🔥

A post shared by cricket Videos (@cricket.latest.videos) on

జోజీ స్టార్స్ తరుపున ఇప్పటివరకు క్రిస్ గేల్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో 46 పరుగులు చేశాడు. ఇక, మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచిన జోజీ స్టార్స్ కెప్టెన్ టెంబా బావుమా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 41 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జోజీ స్టార్‌ జట్టులో బావుమా ఒంటరి పోరాటం చేశాడు.

ఈ క్రమంలో 31 బంతుల్లో 27 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మన్ నిరాశపరచడంతో 18.5 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. నేల్సన్ మండేలా బే గెయింట్స్ బౌలర్లు ఇమ్రాన్ తాహిర్, జూనియర్ డాలాలు చెరో మూడు వికెట్లు పడగొట్టారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నేల్సన్ మండేలా బే గెయింట్స్ 9.1 ఓవర్లలో వికెట్ నష్టానికి లక్ష్యాన్ని చేధించింది. నేల్సన్ మండేలా బే గెయింట్స్ ఓపెనర్లు జేసన్ రాయ్(12 బంతుల్లో 31, 4 ఫోర్లు, 2 సిక్సులు), బెన్ డంక్ తొలి వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. డంక్ 30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 52 పరుగులతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

Story first published: Monday, November 18, 2019, 14:44 [IST]
Other articles published on Nov 18, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+