Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ అసహనం: వార్నర్ అవుటైన బంతి నో బాల్‌ (వీడియో)

హైదరాబాద్: నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు గురువారం పూణెలోని ఎంసీఏ స్టేడియంలో ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు ప్రారంభించిన ఆస్ట్రేలియా ఓపెనర్లను అవుట్ చేసేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

తొలి టెస్టులో ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతోంది. 13 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా వికెట్ కోల్పోకుండా 29 పరుగులు చేసింది. 15వ ఓవర్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. భారత్ బౌలర్ జయంత్ యాదవ్ వేసిన 15వ ఓవర్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో అంఫైర్ వెంటనే దీనిని నో బాల్‌గా ప్రకటించాడు.

దీంతో డేవిడ్ వార్నర్ బ్రతికిపోయాడు. దీంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కాస్తంత అసహనానికి గురయ్యాడు. ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఎంతో డేంజరస్ బ్యాట్స్‌మెన్ అందరికీ తెలిసిందే. అలాంటి విలువైన ఆటగాడు అవుటైన సమయంలో అంఫైర్ నో బాల్‌గా ప్రకటించడంతో కోహ్లీ నిరాశ చెందాడు. ఆ వీడియోని ఇక్కడ చూడండి.

అంతక ముందు ఎనిమిదవ ఓవర్‌లో కోహ్లీ రివ్యూ కోరగా అది విఫలమైంది. ఆ తర్వాత 38 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను ఉమేశ్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. తొలి టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా లంచ్ విరామానికి ఒక వికెట్ నష్టానికి 84 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో షాన్‌మార్ష్‌ 1, స్టీవెన్‌ స్మిత్‌ 1 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+