వికెట్ దక్కింది: ధోని, కోహ్లీని ఒప్పించి డీఆర్ఎస్‌కు వెళ్లిన జడేజా (వీడియో)

హైదరాబాద్: వికెట్ కీపర్‌గా ధోని సత్తా గురించి అందరికీ తెలిసిందే. వికెట్ల వెనుకాల ధోని కదలిక పాదరసం కంటే ఫాస్ట్‌గా ఉంటుంది. అంతేకాదు ఎల్బీని అంచనా వేయడంలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సామర్థ్యం ఏంటో అందరికీ తెలిసిందే. మైదానంలో అంపైర్లు నాటౌట్‌గా ప్రకటించిన ఎన్నో ఎల్బీలను డీఆర్ఎస్ రివ్యూ కోరి ఔట్‌గా మలిచిన సందర్భాలు ఎన్నో మనం చూశాం.
అయితే, తాజాగా తిరువనంతపురం వేదికగా వెస్టిండిస్ జట్టుతో జరుగుతున్న ఐదో వన్డేలో వికెట్ కీపర్‌గా మహేంద్ర సింగ్ ధోని తొలిసారి లెక్క తప్పాడు. రివ్యూ ఎందుకు వేస్ట్ అన్న ధోనిని ఒప్పించి మరీ... జడేజా వికెట్ సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండిస్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో
ఇన్నింగ్స్ 16వ ఓవర్ వేసేందుకు కెప్టెన్ కోహ్లీ బంతిని జడేజాకు ఇచ్చాడు. క్రీజులో షిమ్రోన్ హెట్‌మయర్ ఉన్నాడు. ఆ ఓవర్‌లో జడేజా విసిరిన ఐదో బంతి.. హెట్‌మయిర్ బ్యాట్‌ను తప్పించుకుని ప్యాడ్‌ను తాకింది. దీంతో జడేజా, ధోనీ ఎల్బీగా ఔట్ కోసం అప్పీల్ చేశారు. దీంతో అంఫైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో జడేజా ఔట్ అంటూ ధోనికి చెప్పాడు.
రివ్యూ అవసరంలేదన్న ధోని
ధోని మాత్రం రివ్యూ అవసరంలేదని సూచించాడు. జడేజా మాత్రం పూర్తి విశ్వాసంతో రివ్యూ కోసం పట్టుబట్టడంతో కెప్టెన్ కోహ్లీ మాత్రం రివ్యూ కోరడం విశేషం. దీంతో టీవీ రివ్యూలో బంతి మిడిల్ స్టంప్‌ను తాకినట్టు స్పష్టంగా కనిపించింది. దీంతో అంపైర్ ఔట్‌గా ప్రకటించారు. ఈ మ్యాచ్‌లో 11 బంతులు ఎదుర్కొన్న హెట్‌మెయిర్ 9 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాడు.

31.5 ఓవర్లలో 104 పరుగులకు ఆలౌట్
అంతకుముందు మార్లోన్ శ్యామ్యూల్స్(24)ను జడేజా పెవిలియన్‌కు తరలించాడు. ఇదిలా ఉంటే, ఐదో వన్డేలో వెస్టిండిస్ జట్టు 31.5 ఓవర్లలో 104 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌కు 105 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. వెస్టిండిస్ జట్టులో కేవలం ముగ్గురు బ్యాట్స్‌మన్ మాత్రమే రెండంకెల స్కోరు చేయగా... కెప్టెన్ జాసన్ హోల్డర్ 25 పరుగులతో టాస్ స్కోరర్‌గా నిలిచాడు.
ఎనిమిది మంది బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్స్‌కే
ఆ తర్వాత రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా శామ్యూల్స్(24) నిలిచాడు. విండిస్ జట్టులో ఎనిమిది మంది బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్స్‌కే పరిమితమైపోయారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు పడగొట్టగా, బుమ్రా, అహ్మద్‌కు రెండు, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీసుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications