3వ టీ20: ధావన్‌కు మసాజ్ చేసిన కోహ్లీ (వీడియో)

హైదరాబాద్: సుదీర్ఘమైన సఫారీ పర్యటనను కోహ్లీసేన ఘనంగా ముగించింది. మూడు టీ20ల సిరిస్‌ను 2-1తో కైవసం చేసుకుని 52 రోజుల సఫారీ ప్రదర్శనను విజయ వంతంగా ముగించింది. శనివారం కేప్‌టౌన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో భారత్ 7 పరుగుల తేడాతో ఆతిథ్య దక్షిణాఫ్రికాపై విజయం సాధించిన సంగతి తెలిసిందే.
మూడో టీ20 జరిగిన సమయంలో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్‌కు విరాట్ కోహ్లీ మసాజ్ చేస్తూ కనిపించాడు. వెన్నునొప్పి కారణంగా మూడో టీ20కు కోహ్లీ దూరమైన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితిలో ఏ ఆటగాడైనా డ్రస్సింగ్ రూమ్‌కు పరిమితమై చక్కగా విశ్రాంతి తీసుకుంటాడు. కానీ, విరాట్ అందుకు భిన్నం. టెస్టు మ్యాచ్‌ల సందర్భంగా సహచర ఆటగాళ్లకు కూల్‌డ్రింక్స్ ఇవ్వడం, సూచనలు ఇవ్వడం చేస్తుంటాడు.
ఈ క్రమంలో ధావన్ ఔటై వచ్చిన తర్వాత అతనితో కోహ్లీ ముచ్చటిస్తూ మసాజ్ చేశాడు. సుమారు 20 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో 'ఇలాంటి ఫ్రెండ్ ఒకడు కావాలి', 'విరాట్ కోహ్లీ తన నైపుణ్యాన్ని ధావన్‌కు బదిలీ చేస్తున్నాడు' అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications